Site icon Prime9

AP Assembly : ఏపీ అసెంబ్లీలో రచ్చ.. మీసం తిప్పిన బాలయ్య.. దమ్ముంటే రా అని చెప్పిన అంబటి

ap assembly sessions turned as more heat between tdp vs ycp

ap assembly sessions turned as more heat between tdp vs ycp

AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. కాగా సభ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అసెంబ్లీ (AP Assembly) లో రచ్చ మొదలయ్యింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. బీఏసీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. కానీ సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఒక నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు అతడు ఎంత దొంగైనా, దుర్మార్గుడైనా ఆ పార్టీ సభ్యులకు బాధ కలగడం సహజమైనదే. అయితే అందుకు ఇలా చేయడం సరైనది కాదు. వాయిదా తీర్మానం ఇస్తామని చెప్పారు.. వాయిదా తీర్మానంలో పూర్తిగా చర్చించవచ్చు. టీడీపీ సభ్యులు మీ(స్పీకర్) మీదకు దౌర్జన్యానికి వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలను అహ్వానిస్తున్నారు. మా పార్టీ నుంచి ఆ పార్టీలో చేరిన సభ్యుడు మీ ముందుకు వచ్చి.. మానిటర్‌ను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలను వారు ప్రోత్సహిస్తున్నారు.. రెచ్చగొడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం తిప్పారు. దీంతో మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. మీసాలు సినిమాల్లో తిప్పుకోండి.. కానీ అసెంబ్లీలో కాదు అంటూ బాలకృష్ణకు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరు మధ్యా సవాల్లు ప్రతి సవాళ్లు నెలకొన్నాయి. ఓవరాక్షన్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. వారిపై చర్యలు తీసుకోకుంటే మా సభ్యులు కూడా కోపద్రిక్తులకు లోనయ్యే అవకాశం ఉందని మాట్లాడారు. అలానే బాలయ్యకు కూడా నువ్వు రా దమ్ముంటే.. దమ్ముంటే రా..’’ అంటూ సవాలు విసిరారు.

ఆ సమయంలోనే  వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బాలకృష్ణను చూస్తూ తొడ గొట్టారు.. అదే విధంగా కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే టీడీపీ ఆందోళన చేస్తోందని బుగ్గన మండిపడ్డారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొంత సమయం తర్వాత ఇందుకు సంబంధించిన వీడియో బయటికి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే స్పీకర్ తమ్మినేని.. శాసనసభను 10 నిమిషాలు వాయిదా వేశారు.

 

Exit mobile version