Site icon Prime9

AP Assembly Sessions: 15 నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Sessions from 15

AP Assembly Sessions from 15

Amaravathi: ఈ నెల 15 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. సమావేశంలో ప్రవేశపెట్టే అంశాలను బిల్లుల వారీగా ఆయా శాఖల నుండి 12వ తేది లోపు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలంటూ సిఎంవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలను ఎన్నిరోజులు జరపాలన్న అంశాన్ని అసెంబ్లీ వ్యవహారాల కమిటి సమావేశంలో తీర్మానించనున్నారు.

ఈ దఫా చేపట్టనున్న అసెంబ్లీ సమావేశాల్లో పేదలకు అన్నం పెట్టే  అన్నా క్యాంటిన్ పై దాడులు, విధ్వంసాలు, దారుణమైన రోడ్ల తీరు, మూడు రాజధానుల వ్యవహారంతో పాటు అమరావతి రైతుల మహా పాదయాత్ర 2 పై సాగే చర్చలు హాట్ టాపిక్ గా మారనున్నాయి.

Exit mobile version