Site icon Prime9

Pawan Kalyan: అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసు పై దృష్టి.. పవన్ కల్యాణ్

After coming to power I will focus on Sugali Preeti case...Pawan Kalyan

Andhra Pradesh: జనసేన పార్టీ అధికారంలోకి రాగానే తొలి దృష్టి ఏపీలో సంచలనం సృష్టించిన 10 తరగతి విద్యార్ధిని సుగాలి ప్రీతిబాయ్ అనుమానస్పద మృతి కేసుపైనే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 2017లో కర్నూలులో జరిగిన ఈ ఘటన పై నాడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం తెప్పించేలా చేసిందన్నారు. అనంతరం ప్రభుత్వం సీబీఐకి కేసును అప్పజెప్పిందని నేటికి అది పూర్తి స్థాయిలో ముందుకు పోలేదని పవన్ పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ ఈ మేర పేర్కొన్నారు.

మరోవైపు లా అండ్ ఆర్డర్ పై ఫోకస్ పెడుతామన్నారు. రాడ్లతో కొట్టుకోవడం, వైసిపి వాళ్లు బాబాయ్ ను చంపుకొన్నట్లు పాలన కాదన్నారు. బలహీనులకు బలంగాకాకుండా, బలవంతులకు బలహీనంగా కాకుండా ఉండేలా లా అండ్ ఆర్డర్ ఉండాలన్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే నడి సమాజంలోనే వారు శిక్షింపబడాలని పవన్ కోరుకున్నారు.

వైకాపా లాంటి గూండాగిరి చేసే నాయకులను జనసేన పార్టీ ప్రోత్సహించదన్నారు. వార్డు సభ్యుల దాక గూండాగిరి చేసేవారికి పోలీసుల సపోర్టు ఉండడం వంటి సంఘటనలు  అధికారంలోకి  వచ్చిన తర్వాత సమూలంగా మార్పులు చేయడం తధ్యమన్నారు. వయసు మీదపడిన వారిని సైతం వైకాపా గూండాలు మానభంగాలు చేస్తామంటూ వారు పేర్కొంటున్న మాటలు కరెక్టు కాదన్నారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: బీమాతో కార్యకర్తల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..

Exit mobile version