Site icon Prime9

YS Sharmila: కేసీఆర్ కు బూట్లు పంపిన వైఎస్ షర్మిల.. తనతో కలసి పాదయాత్ర చేయాలని పిలుపు

YS Sharmila

YS Sharmila

YS Sharmila: తెరాస ప్రభుత్వంపై మరోసారి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తనతో తనతో కలిసి పాదయాత్ర చేయాలంటూ సీఎం కేసీఆర్ కు బూట్లు పంపారు. ప్రభుత్వం కావాలనే తన పాదయాత్రను అడ్డుకుంటోందని ఈ సందర్భంగా షర్మిల ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కావాలనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ప్రభుత్వ తీరుపై వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పిట్టల దొరలా టోపీ పెట్టుకొని తిరగడం కాదని.. తనతో కలిసి పాదయాత్రకు రావాలని కోరారు. రాష్ట్రం ఏర్పాడ్డాక.. కేసీఆర్ కుటుంబం తప్పా.. ఏ ఒక్కరు బాగుపడలేదని అన్నారు.

విద్యార్ధుల ప్రాణాలకు తెగించి రాష్ట్రం కోసం పోరాటం చేస్తే.. వారి కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..

కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల Ys Sharmila  సంచలన ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే.. ముక్కు నేలకు రాసి రాజకీయాలను నుంచి తప్పుకుంటా అని ఛాలెంజ్ విసిరారు.

సమస్యలు ఉన్నాయని రుజువైతే.. కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ కు దమ్ముంటే ఈ సవాల్ ను స్వీకరించాలని అన్నారు.

తమ పాలనపై ఏ మాత్రం నమ్మకమున్న ఈ సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

పాదయాత్రకు రావాలని.. కేసీఆర్ కు బూట్లు కూడా పంపించారు.

పిట్టల దొరలా విదేశాల్లో తిరగడం కాదని.. స్థానిక సమస్యలను పట్టించుకోవాలని కోరారు.

వైఎస్ హయంలో ఉమ్మడి రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని అన్నారు.

కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం తప్పా.. రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరు బాగుపడలేదని అన్నారు.

పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో మళ్లీ అక్కడి నుంచే పాదయాత్ర కొనసాగిస్తానని అన్నారు.

పాదయాత్రను అడ్డుకున్న ముందుకు సాగుతామని తెలిపారు.

పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా.. ముందుకు సాగుతామని షర్మిల YS Sharmila ఉద్ఘాటించారు.

రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలను అంతం చేసేందుకే వైఎస్ ఆర్టీపీ ఉన్నట్లు తెలిపారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version