Site icon Prime9

Monkeypoxs: మంకీపాక్స్ పేరు మార్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

WHO-recommends-new-name-for-monkeypox

WHO-recommends-new-name-for-monkeypox

Monkeypoxs: ఈ ఏడాది భారత్ సహా పలు దేశాలను వేగంగా విస్తరిస్తూ ప్రజలను భయపెడుతోన్న మంకీపాక్స్‌కు కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మంకీపాక్స్ అనే పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును ‘ఎంపాక్స్’గా మార్చింది. ప్రపంచ నిపుణులతో పలు సంప్రదింపుల తర్వాత ఈ పేరును ప్రకటించింది. మంకీపాక్స్, ఎంపాక్స్ అనే పేర్లు రెండూ ఏడాది పాటు ఉపయోగంలో ఉంటాయని, ఆ తర్వాత మంకీపాక్స్ అనే పేరు కనుమరుగవుతుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

ఈ ఏడాది ప్రారంభంలో మంకీపాక్స్ వ్యాపించినప్పుడు కొన్ని కమ్యూనిటీల్లో జాత్యహంకార, కళంకం కలిగించే భాషను ఉపయోగించడాన్ని పలువురు వ్యక్తులు, దేశాలు ఆ పేరుపై ఆందోళన వ్యక్తం చేశాయి. జాత్యహంకారానికి తావులేని విధంగా పేరును మార్చాలని డబ్ల్యూహెచ్ఓను కోరాయి. దీంతో పలు పరిశీలనలు చేసిన సంస్థ చివరికి ‘ఎంపాక్స్’ గా పేరు మార్చింది. అసాధారణంగా ఉన్న వ్యాధులకు పేర్లు కేటాయించడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.

ఎంపాక్స్‌ అనేది ఓ అరుదైన వైరల్‌ వ్యాధి. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలోని వర్షారణ్య ప్రాంతాల్లో ఈ ఇన్ఫెక్షన్‌ను తొలిసారిగా గుర్తించారు. అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం మంకీపాక్స్‌ కేసులు మే నుంచి అనేక దేశాల్లో నమోదవడం మొదలయ్యాయి.

ఇదీ చదవండి: ఆఫ్ఘాన్‌లో ఆకలి కేకలు.. అన్నం బదులుగా నిద్రమాత్రలు

Exit mobile version
Skip to toolbar