Site icon Prime9

Vijay Devarakonda : సమంత హెల్త్ గురించి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ.. కాంటాక్ట్ లో లేదంటూ !

vijay devarakonda interesting comments on samantha health issue

vijay devarakonda interesting comments on samantha health issue

Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన లైగర్ చిత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో తనకి బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విజయ్. గతంలో శివ దర్శకత్వం వహించిన మజిలీ సినిమాలో సామ్ నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. అంతకు ముందు మహానటి చిత్రంలో విజయ్ – సామ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మాట్లాడుతూ.. మీ అందరికి ఖుషీ ఇవ్వడానికే మా ప్రయత్నం అని తెలిపాడు. సెప్టెంబర్ 1 న ఆ ప్రేక్షకులు థియేటర్ నుంచి నవ్వుతు వస్తారని, ఇలా నవ్వుతు ప్రేక్షకులు బయటికి వచ్చే సినిమా అంతకుముందు ఎప్పుడు ఇచ్చానో గుర్తులేదని విజయ్ అన్నాడు.

ఇక సమంత గురించి విజయ్ మాట్లాడుతూ.. ” సమంత.. ఈ సినిమాకు మెయిన్ అని చెప్పారు. ఆమె లేకపోతే ఈ సినిమా లేదు.. మొదట నుంచి సినిమా షూటింగ్ అయ్యేవరకు అంతా సజావుగా జరుగుతుంది అనుకొనేలోపు సామ్ హెల్త్ బాలేదు. జూలై నెలలో షూటింగ్ ను ఆపేశాం. చూడడానికి ఇంత అందంగా ఉంది.. స్క్రీన్ పై ఎంత అందంగా కనిపిస్తుంది. అలాంటి అమ్మాయికి హెల్త్ బాలేదేంటి అంటుంది అని అనుకున్నాం. కానీ, సడెన్ గా ఒకరోజు న్యూస్ తెలిసింది. మూడు రోజుల్లో వస్తుంది అనుకున్నాం.. ఆతరువాత రెండు వారాల్లో సెట్ అవుతుంది అనుకున్నాం.. కానీ, అది ఎంత సీరియస్ అనేది సమంత చెప్పిన తరువాతనే తెల్సింది. ఆ తరువాత నుంచి మాతో సామ్ కాంటాక్ట్ లో లేదు. ఇక కొద్దిగా సెట్ అయ్యాక ఆమె షూటింగ్ లో పాల్గొంది. ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేసింది అని చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్. టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. ఇక ఏ ఈవెంట్ లో విజయ్ – సామ్ కలిసి పర్ఫామెన్స్ ఇవ్వడం ఇండస్ట్రిలో హాట్ టాపిక్ మారగా.. ఆ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. చూడాలి మరి ఈ మూవీ సామ్, విజయ్ కి సక్సెస్ ని ఇస్తుందో, లేదో అని..

Exit mobile version