Site icon Prime9

Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌లు ఏవంటే..?

upcoming releases of movies and web series details in august 2nd week

upcoming releases of movies and web series details in august 2nd week

Upcoming Releases : ఆగస్టు మొదటి వారంలో టాలీవుడ్ కి మంచి జోష్ ఇచ్చింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ “బ్రో” సక్సెస్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ తరుణం లోనే రెండవ వారంలో కూడా పలు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఒక్క రోజు గ్యాప్ తో సూపర్ స్టార్ రజినీ కాంత్, మెగాస్టార్ చిరంజీవి పోటీ పడుతుండడం సినిమా లవర్స్ కి పండగే అని చెప్పాలి. ఇటీవలే మెగా ఫ్యామిలీ నుంచి ఒక హిట్ అందుకోగా.. చిరు ఈ చిత్రంతో విజయపరంపరని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు (Upcoming Releases) ..

భోళా శంకర్‌.. 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. యంగ్ హీరో సుశాంత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్.. ఈ మూవీతో కూడా సక్సెస్ ని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు.

జైలర్‌.. 

సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా.. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘జైలర్‌’. ప్రముఖ నటులు మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా చేస్తుంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీతో రజినీ మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఇక ఈ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉస్తాద్‌..

యంగ్ హీరో శ్రీ సింహా.. మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఫణిదీప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ఉస్తాద్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రజనీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు నిర్మించిన ఈ మూవీలో కావ్యా కళ్యాణ్ రామ్‌ హీరోయిన్ గా చేసింది. గౌతమ్‌ మేనన్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది.

ఓ మై గాడ్‌ 2 ..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్‌’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) రూపొందిన సంగతి తెలిసిందే. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గదర్‌ 2.. 

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవోల్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గదర్‌ 2’. ఇందులో ఆయన తారా సింగ్‌ పాత్రలో నటిస్తున్నారు. సకీనాగా అమీషా పటేల్‌ నటిస్తోన్న ఈ చిత్రానికి అనిల్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. చరణ్‌జీత్‌గా ఉత్కర్ష్‌ శర్మ కనిపించనున్నారు. జీ స్టూడియోస్‌తో అనిల్‌ శర్మ, కమల్‌ ముకుట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌ల వివరాలు (Upcoming Releases)..

నెట్‌ఫ్లిక్స్‌..

గబ్బీస్‌ డాల్‌ హౌస్‌ (మూవీ) ఆగస్టు 07

జాంబీవెర్స్‌ (కొరియన్‌) ఆగస్టు 08

హార్ట్‌ ఆఫ్ స్టోన్‌ (మూవీ) ఆగస్టు 11

ఇన్‌ అనదర్‌ వరల్డ్‌ విత్‌ మై స్మార్ట్‌ ఫోన్‌ (మూవీ) ఆగస్టు 11

పెండింగ్‌ ట్రైన్‌ (మూవీ) ఆగస్టు 11

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో..

మేడ్‌ ఇన్‌ హెవెన్‌ (వెబ్‌సిరీస్) ఆగస్టు 10

ఆహా..

హిడింబ (తెలుగు) ఆగస్టు 10

జీ5..

ది కశ్మీర్‌ ఫైల్స్‌ అన్‌ రిపోర్టెడ్‌ (జీ ఒరిజినల్‌) ఆగస్టు 11

అబర్‌ ప్రోలీ (బెంగాలీ) ఆగస్టు 11

సోనీలివ్‌..

ది జంగబూరు కర్స్‌ (సోనీలివ్‌ ఒరిజినల్‌) ఆగస్టు 9

పొర్‌ తొళిల్ (తమిళ్‌/తెలుగు) ఆగస్టు 11

 

Exit mobile version