Kaikala Sathyanarayana : తెలుగు సినీ పరిశ్రమ మరో కళామ్మ తల్లి ముద్దుబిడ్డని కోల్పోయింది. “నవరస నటనా సార్వభౌమగా” ఖ్యాతి కెక్కిన కైకాల సత్యనారాయణ గురించి తెలియని వారుండరు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద వంటి పాత్రలేన్నింటినో పోషించి గొప్ప నటుడిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను ఆయన పోషించారు. అయితే తాజాగా కైకాల స్వల్ప అస్వస్థతకు గురయినట్లు తెలుస్తుంది. 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగ ప్రవేశం చేశాడు.
సపోర్టింగ్ యాక్టర్‌గా, ప్రతినాయకుడిగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిపి దాదాపు 770 సినిమాలకు పైగా చేసిన కైకాల… నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను నిర్మించాడు. అయితే గత కొంతకాలంగా కైకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ తరుణంలోనే ఈరోజు కైకాల సత్యనారాయణ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు కైకాల ఆత్మకు శాంతి కలగాలని ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే స్పందించిన ప్రధాని మోదీ… ప్రసిద్ధ సినీ దిగ్గజం శ్రీ కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యం తో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. అని ట్వీట్ చేశారు .
ప్రసిద్ధ సినీ దిగ్గజం శ్రీ కైకాల సత్యనారాయణ గారి మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యం తో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.
— Narendra Modi (@narendramodi) December 23, 2022
ఏపీ సీఎం జగన్ స్పందిస్తూ… గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/eJdUwqnINz
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2022
బాలకృష్ణ… కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పోస్ట్ చేశారు.
Natasimham Shri #NandamuriBalakrishna expressed his deepest condolences on the sudden demise of legendary actor #KaikalaSatyanarayana garu. pic.twitter.com/x6wd5Oyh67
— BA Raju’s Team (@baraju_SuperHit) December 23, 2022
రామ్ చరణ్.. ‘కైకాల సత్యనారాయణ గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. మన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది !! వారి ఆత్మకు శాంతి చేకూరు గాక’ అని ట్వీట్ చేశారు.
Deeply saddened to hear the demise of Kaikala Satyanarayana Garu..
His contribution to our film industry will be remembered forever !!
May his soul rest in peace🙏— Ram Charan (@AlwaysRamCharan) December 23, 2022
మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ‘కైకాల సత్యనారాయణ గారు మృతి చెందడం చాలా బాధాకరం. ఆయనతో పనిచేసినందుకు నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా మిస్ అవుతాను. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరు గాక’ అని తెలిపారు.
Extremely saddened by the passing away of #KaikalaSatyanarayana garu. I have some very fond memories of working with him. He will be missed. My deepest condolences to his family and loved ones. May his soul rest in peace 🙏🙏🙏
— Mahesh Babu (@urstrulyMahesh) December 23, 2022
మరో టాలీవుడ్ హీరో శర్వానంద్.. ‘ఓం శాంతి. కైకాల సత్యనారాయణ గారు’ అంటూ నమస్కరిస్తున్న సింబల్‌తో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Om Shanti
Kaikala Satyanarayana garu 🙏🏼My thoughts and prayers with the family 🙏🏼
— Sharwanand (@ImSharwanand) December 23, 2022
కైకాల సత్యనారాయణ మృతితో దుఃఖంలో మునిగిపోయినట్లు తెలిపిన రవితేజ.. భారతీయ సినిమా చూసిన అత్యుత్తమ నటుల్లో ఆయన ఒకరని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రియమైన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Grief-stricken by the demise of the
legendary actor Kaikala Satyanarayana garu. He is One of the finest actors Indian cinema has ever seen.My sincere condolences to his family & dear ones. Om Shanti 🙏
— Ravi Teja (@RaviTeja_offl) December 23, 2022
కైకాల సత్యనారాయణ గారి మరణవార్త తెలిసి చాలా బాధ కలిగిందని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. తెలుగు వెండితెరపై ఎన్నో పాత్రలను చిరస్థాయిగా నిలిపిన లెజెండ్ అని పోస్టు చేశారు.
Saddened to know about the passing of Kaikala Satyanarayana garu. An absolute legend who immortalised many characters on our Telugu silver screen.
Om Shanti
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) December 23, 2022
లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి కలగాలని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ట్వీట్ చేయగా.. మిమల్ని ఎప్పటికీ కోల్పోతున్నాం అని దర్శకుడు మారుతి ‘రెస్ట్ ఇన్ పీస్ లెజెండ్’ అంటూ ట్వీట్ చేశారు.
Legendary actor #KaikalaSatyanarayana garu 🙏 RIP
May his soul rest in peace 🙏 pic.twitter.com/ZjHUeKHkQ3
— BANDLA GANESH. (@ganeshbandla) December 23, 2022
హీరో శ్రీకాంత్.. ‘లెజెండరీ యాక్టర్ కైకాలసత్యనారాయణ ఇక లేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
Deeply Saddened to hear that Legendary actor #KaikalaSatyanarayana garu is no more. May his soul rest in peace and Strength to his family and friends.
Om Shanti 🙏🙏 pic.twitter.com/abTtF666ui
— SRIKANTH MEKA (@actorsrikanth) December 23, 2022
తెలుగు సినిమా స్వర్ణయుగంలో నాకు ఇష్టమైన నటుల్లో ఒకరు. మన ఇంట్లో మనిషిలా అనిపిస్తారు. లెజెండరీ యాక్టర్. వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని హీరో నాని ట్వీట్ చేశారు.
Kaikala Satyanarayana gaaru 💔
One of my favourite actors from golden era of Telugu cinema. Mana intlo Manishi la anipistharu. Legendary body of work. Condolences to family🙏🏼— Nani (@NameisNani) December 23, 2022
కైకాల మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన గోపీచంద్.. ‘లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారు తన సినిమాల ద్వారా జీవించే ఉంటారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ట్వీట్ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు.
Deeply saddened by the demise
of legendary actor Kaikala Satyanarayana garu. He will continue to live on through his work.
My deepest condolences to his family.#RIPKaikalaSatyanaryanaGaru— Gopichand (@YoursGopichand) December 23, 2022
లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఏ పాత్రకైనా ప్రాణం పోసే అరుదైన నటనా వ్యక్తిత్వం ఆయనది. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబం శాంతి, శక్తిని పొందుగాక! ఓం శాంతి’ అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
Saddened to hear about the passing away of legendary actor Kaikala Satyanarayana garu. He was one of the rarest acting personalities who can breathe life into any character.
May his family find peace & strength in this hour of grief! Om shanti
— Anil Ravipudi (@AnilRavipudi) December 23, 2022
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
I express profound grief and sadness over the demise of Sri Kaikala Satyanarayana, Telugu film actor, producer, director, and former Member of Parliament in Lok Sabha, on Friday in Hyderabad.
Offer my heartfelt condolences to the bereaved family members. pic.twitter.com/ASXb2tAPdX— Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) December 23, 2022
కోన వెంకట్
Very sad to hear that the great, versatile actor Sri Kaikala Satyanarayana garu is no more 🙏 Telugu Film industry has lost another legend. May his great soul rest in peace 🙏 pic.twitter.com/LDhnD2H387
— KONA VENKAT (@konavenkat99) December 23, 2022