Site icon Prime9

Telugu Movies: ఈ వారం ఓటీటీ/థియేటర్‌లో అలరించే చిత్రాలివే!

ott

ott

Telugu Movies: వేసవిలో సినిమాల సందడి ఎక్కువే. ఈ వారంలో ప్రేక్షకులను అలరించడానికి.. థియేటర్, ఓటీటీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సారి ఎక్కువ సినిమాలు థియేటర్ లో సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓసారి లుక్కేద్దాం.

సరికొత్త పాత్రలో సమంత (Telugu Movies)

సమంత తాజా చిత్రం శాకుంతలం. పౌరాణిక పాత్రలో సమంత ఇందులో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని 3డీ వెర్షన్ లో కూడా తీసుకొస్తున్నారు. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల – దుష్యంతుల ప్రేమకావ్యం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ప్రధాన పాత్రను సమంత పోషించింది. దుష్యంతుడిగా దేవ్‌మోహన్‌.. మోహన్‌బాబు, సచిన్‌ ఖేడ్కర్‌, ప్రకాష్‌ రాజ్‌ ఇతర నటులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

లారెన్స్ ‘రుద్రుడు’

రాఘవ లారెన్స్‌ నటించిన తాజా చిత్రం రుద్రుడు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా.. కతిరేశన్ దర్శకత్వం వహించిన సినిమా రుద్రుడు. శరత్‌ కుమార్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 14వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాకి జి.వి.ప్రకాష్‌ కుమార్ సంగీతం అందిచాడు.

విడుదల పార్ట్-1

తమిళంలో విజయవంతమైన సినిమా విడుదల పార్ట్ 1. ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించారు. పీరియాడిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్ లో నిర్మించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్‌ 15న రానుంది.

 

ఓటీటీ చిత్రాలు..

‘అసలు’ఏం జరిగింది?

ఓ దారుణమైన హత్యను ఛేదించడానికి ఓ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడనేది స్టోరీ. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అసలు’. రవిబాబు పోలీస్‌ పాత్రలో నటించాడు. ఉదయ్‌, సురేష్‌ దర్శకత్వం వహించారు. పూర్ణ, సూర్యకుమార్‌, సత్యకృష్ణన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈటీవీ విన్‌ ద్వారా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దాస్ కా ధమ్కీ..

విష్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ‘ఆహా’ వేదికగా ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌

ఫ్లోరియా మాన్‌ (వెబ్‌సిరీస్) ఏప్రిల్‌ 13
అబ్సెషన్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 13
క్వీన్‌ మేకర్‌ (కొరియన్‌ సిరీస్‌) ఏప్రిల్‌ 14
ది లాస్ట్‌ కింగ్‌డమ్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 14

అమెజాన్‌

ది మార్వెలస్‌ మిస్సెస్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 14

జీ5
మిస్సెస్‌ అండర్‌కవర్‌ (హిందీ) ఏప్రిల్‌ 14

డిస్నీ+హాట్‌స్టార్‌

టైనీ బ్యూటిఫుల్‌ థింగ్స్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 9
ఓ కల (తెలుగు) ఏప్రిల్‌ 13

ఎంఎక్స్‌ ప్లేయర్‌

ది సాంగ్‌ ఆఫ్‌ గ్లోరీ (హిందీ సిరీస్‌) ఏప్రిల్‌ 12

Exit mobile version