Site icon Prime9

Suriya: “గజిని” స్వీక్వెల్.. సిద్దమవుతున్న సూర్య..!

suriya gajini movie sequel

suriya gajini movie sequel

Suriya: తమిళంతో పాటు తెలుగునాట మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య నటించిన గజిని సినిమా గురించి తెలియని సినీ లవర్స్ ఉండరు. అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు ఆ సినిమాకు స్వీక్వెల్ రాబోతుందంటూ కోలీవుడ్ వర్గాల సమాచారం.

తమిళంతో పాటు తెలుగునాట మంచి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య. అయితే ఈయన చేసిన సినిమాల్లో ‘గజిని’మూవీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పటివరకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకు ఈ చిత్రం అమాంతం స్టార్‌ స్టేటస్‌ను తెచ్చిపెట్టింది. ఇంక ఈ మూవీతోనే సూర్యకు టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఏ. ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మూవీలో సూర్య న‌ట‌న అయితే వ‌ర్ణణాతీతం.

కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాపై ఇప్పటికే మురుగదాస్‌ స్క్రిప్ట్‌ పనులు కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా స్క్రిప్ట్‌ను పూర్తి చేసి సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్లాలని యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇకపోతే ఈ సీక్వెల్‌ కోసం సూర్య కూడా ఎగ్జైటింగ్‌ ఎదురు చూస్తున్నాడట. అన్ని కుదరితే త్వరలోనే ఈ సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

ఇదీ చదవండి: మీడియాపై చిరంజీవి ఆగ్రహం..!

Exit mobile version