Site icon Prime9

Nandamuri Balakrishna : రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా.. అయిన వారికి ఆపద వస్తే ఆగని బాలకృష్ణ.. తారకరత్న కోసం అన్నీ తానై !

special story on nandamuri balakrishna about caring towards taraka ratna

special story on nandamuri balakrishna about caring towards taraka ratna

Nandamuri Balakrishna :  నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.

తెరపై గంభీరంగా కనపడే ఈయన మనసు సున్నితమని, తన చుట్టూ ఉన్నవారి యోగ క్షేమాలు చూసుకుంటారు అని అయన సన్నిహితులు చెపుతూ ఉంటారు.

అలాంటిది తన కుటుంబ సభ్యుడు, అన్న కొడుకు అయిన తారకరత్నకి గుండెపోటు వచ్చి ప్రాణాల కోసం పోరాడుతుంటే ఇంక ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఇక చెప్పనక్కర్లేదు.

బాబాయ్ అంటూ ప్రేమగా పిలిచే తారకరత్న కోసం.. అన్నీ తానై తారకరత్న ప్రాణాలను కాపాడేందుకు అన్నీ ప్రయత్నాలను చేస్తూ బాలయ్య అందరి మనసులను గెలుచుకుంటున్నారు.

తారకరత్నకి కూడా బాలకృష్ణ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తారక రత్న చేతిపై బాలయ్య పేరు పచ్చబొట్టు గా వేయించుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే.

 

అయిన వారికి ఆపద వస్తే అర క్షణం కూడా ఆలోచించను అనే మాటను నిజం చేస్తూ బాలయ్య తారకరత్న కోసం అండగా నిలబడుతున్నారు.

ఒకరకంగా తారక రత్న కోలుకోవడానికి బాలయ్య కారణం అనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం బాలకృష్ణ అటు సినిమాలు ఇటు రాజకీయాలే కాకుండా ప్రోగ్రాం లలో బిజీగా ఉంటూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు.

ఎంత బిజీగా ఉన్నా కూడా తన కుటుంబాన్ని మాత్రం మరువరు బాలయ్య.

చావుబతుకుల మధ్య పోరాడుతున్న తన అన్న కొడుకుని సొంత కొడుకుగా దగ్గరుండి మరీ చూసుకుంటూ అబ్బాయిని కాపాడుకుంటున్నారు ఈ బాబాయి.

ఈ నెల 27న లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తారకరత్న కుప్పం వచ్చాడు.

అక్కడ లోకేష్‌, బాలకృష్ణ తదితరులతో కలిసి మసీదులో ప్రార్థనలు నిర్వహించి బయటకు వస్తుండగా.. సడెన్‌గా తారకరత్న స్పృహ తప్పి పడిపోయాడు.

చలనం లేకుండా ఆస్పత్రిలో ఉండటం బాలయ్యను ఎంతగానో కదిలించిందని తెలుస్తోంది.

వెంటనే ఆయనను కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించారు.

ఇక తారకరత్నతో పాటు బాలకృష్ణ కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నాడు.

ఆ సమయంలోనే తారక రత్న మీద ప్రేమతో ఆయనకు ఏం కాకూడదు అని చలనం లేని స్థితిలో ఉన్న తారకరత్నకు చెవిలో మృత్యుంజయ మంత్రం చదివి వినిపించారు.

ఆ తర్వాత దేవుడు ఆశీర్వాదలు కూడా తరకరత్నకు తొడవ్వడంతో గుండె పనిచెయ్యడం స్టార్ట్ అవ్వడం మెరాకిల్ అని చెప్పాలి.

నిరంతరం వైద్యులతో మాట్లాడుతూ.. చికిత్సకు అవసరమైన వాటిని సమకూర్చుతూ.. తారకరత్నకు అండగా నిలిచాడు.

(Nandamuri Balakrishna) అన్నీ తానై అండగా ఉంటున్న బాలకృష్ణ..

అంతేకాక తారకరత్న భార్యను ఆస్పత్రికి వద్దకు పిలిపించి.. ఆమెకు పరిస్థితి వివరించి.. భయపడొద్దని ధైర్యం చెప్పి.. కొడుకుపై తన ప్రేమను, బాధ్యతను చాటుకున్నాడు బాలకృష్ణ.

ఆ తర్వాత తారకరత్నను బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి.. అక్కడ ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

బెంగళూరులో తారకరత్న చికిత్స పొందుతున్న నారాయణ హృదయాల ఆస్పత్రి వద్దే ఉండి పర్యవేక్షిస్తున్నారు.

ఇక గత మూడు రోజులుగా బాలకృష్ణ.. తారకరత్న వెంటే ఉన్నాడు.

అటు వైద్యులతో మాట్లాడుతూ.. వారు కోరినవి ఏర్పాటు చేస్తూ.. ఇటు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి జనాలకు ఎప్పటికప్పుడు అప్డేట్‌ ఇస్తూ.. కష్టకాలంలో ఎంతో హుందాగా వ్యవహరిస్తోన్నాడు బాలయ్య.

తారక రత్న ఆరోగ్యం గురించి డాక్టర్లని అడిగి తెలుసుకుంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిని అభిమానులకి తెలియచేస్తున్నారు బాలయ్య.

మరోవైపు తారకరత్న కుటుంబసభ్యులకు కూడా బాలయ్య అండగా నిలబడ్డారు.

అలానే తారకరత్న కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం బాగుపడాలని ప్రార్థించాలని అభిమానులకు సూచించారు.

సాధారణంగా అయితే అభిమానుల మీద విరుచుకుపడతాడు.. నోటికి ఫిల్టర్‌ లేకుండా మాట్లాడతాడు అంటూ బాలయ్య తీరును విమర్శించే వారు..

దీంతో ప్రస్తుతం తారకరత్న విషయంలో ఆయన చూపిస్తోన్న శ్రద్ధ చూసి.. ప్రశంసిస్తున్నారు.

మనవాళ్లు అనుకుంటే బాలయ్య ఎంతలా అభిమానిస్తారో.. ఈ సంఘటనతో తెలిసిపోయింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తారకరత్న విషయంలో బాలయ్య తీసుకుంటున్న శ్రద్ధ నిజంగానే అద్భుతం అని చెప్పాలి.

 

(Nandamuri Balakrishna) బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ ఎంపీ : విజయసాయి రెడ్డి

అయితే రాజకీయాల పరంగా బాలయ్యపై ఎప్పుడు విమర్శలు చేసే వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి సైతం బాలయ్యకు తారకరత్న విషయంలో అభినందనలు చెప్పడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

తారకరత్నను చూసేందుకు ఆయన సమీప బంధువు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆస్పత్రికి వచ్చారు.

ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

విజయసాయిరెడ్డి సతీమణి చెల్లెలి కుమార్తె అలేఖ్యా రెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు.

తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, గుండె పనితీరు పర్ఫెక్ట్‌గా ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. రక్త ప్రసరణ కూడా మెరుగైందని చెప్పారు.

గుండెకు సంబంధించిన సమస్యలేవీ లేవని డాక్టర్లు చెప్పారని వివరించారు.

‘తారకరత్నకు డాక్టర్లు అద్భుతంగా చికిత్స అందిస్తున్నారు, నందమూరి బాలకృష్ణ దగ్గరుండి, అన్నీ తానై చూసుకుంటున్నారు. ఆయనకు కృతజ్ఞతలు’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

దీంతో అందరూ బాలయ్య మంచి మనస్సుని మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.

అలానే నందమూరి తారకరత్న ఆరోగ్యవంతునిగా తిరిగిరావాలని ఆశిస్తూ.. యావత్ తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version