Andhra Pradesh: గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలపై విచారణ జరుగుతోందని రిపోర్టులు వచ్చాకే చర్యలుంటాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాధవ్ వేధించినట్లు ఏ మహిళా ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదన్నారు సజ్జల ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ అవునా, కాదా అనేది ఏడేళ్లయినా ఇంకా తేలలేదని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ పగటి కలలు కంటోందని అన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయం అని స్పష్టం చేశారు
Sajjala Ramakrishna Reddy: టీడీపీ పగటి కలలు కంటోంది.. సజ్జల రామకృష్ణారెడ్డి.
