Site icon Prime9

Devara Movie : ఎన్టీఆర్ “దేవర” మూవీ నుంచి సైఫ్ అలీ ఖాన్ కి బర్త్ డే గిఫ్ట్.. “భైర” పోస్టర్ రిలీజ్

saif ali khan poster released from ntr devara movie

saif ali khan poster released from ntr devara movie

Devara Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ” యంగ్ టైగర్ ఎన్టీఆర్”. ఇక రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ లెవెల్ కి చేరింది. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరిగిందని చెప్పాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా “దేవ‌ర‌”. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ ఆంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో విలన్స్ గా కనిపించనున్నారు.

ఈ సినిమాలో మరో ప్రత్యేక విషయం ఏంటి అంటే.. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణంలో రాబోతుండడం. అలానే ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా ఫుల్ మాస్ యాక్షన్ గా ఉంటుందని ఇప్పటికే కొరటాల శివ చెప్పారు. ఈ మేరకు ఇటీవల టైటిల్ తో పాటు రిలీజ్ చేసిన తారక్ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ రాబోతుందని మొదటి నుంచి చెప్పున్న మాటలకు ఈ పోస్టర్ మరింత ఊపు ఇచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.

నేడు సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా దేవర సినిమా నుంచి సైఫ్ అలీ ఖాన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సైఫ్ క్యారెక్టర్ పేరు భైరా అని ప్రకటించారు. సముద్రం, అలలు మధ్య భైరాని చూపించారు. లాంగ్ హేయవర్ తో సైఫ్ ఊర మాస్ గా అనిపిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ -సైఫ్ మధ్య యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేయగా.. తాజాగా మూడో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారని సంచారం అందుతుంది. హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్ లో ఈ షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది. సుమారు 10 రోజులు పాటు ఈ షెడ్యూల్ జరగనుంది అని టాక్ నడుస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

Exit mobile version
Skip to toolbar