Kodali Nani Followers Join in Janasena Party: గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి పాలంకి బ్రదర్స్ షాకిచ్చారు. వైసిపి వీడి వారిద్దరూ జనసేనలో చేరారు. జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సమక్షంలో పాలంకి సారధిబాబు, మోహన్ బాబు జనసేనలో చేరారు. జనసేన జెండా కప్పి పాలంకి బ్రదర్స్ ను ఆయన సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2019 నుండి వైసిపిలో కొనసాగుతున్నామని, కొడాలి నానితో కలిసి వైసిపి విజయానికి పని చేశామని పోలంకి సారధిబాబు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొడాలి నాని శృతి మించి మాట్లాడుతున్నారని, ఆయన పై తరచూ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము రాజకీయ విమర్శలు చేయాలని కోరినా నాని పట్టించుకోలేదని పాలంకి బ్రదర్స్ తెలిపారు .
గుడివాడలో నాని వ్యాఖ్యలును ప్రజలే చీదరించుకుంటున్నారని తెలిపారు. ఇక వైసిపిలో కొనసాగలేమని నిర్ణయం తీసుకుని బయటకు వచ్చామని, ఈరోజు జనసేనలో చేరడం ఆనందంగా ఉందని పాలంకి బ్రదర్స్ అన్నారు. జనసేన పార్టీ విజయం కోసం అందరినీ కలుపుకుని పని చేస్తామని, వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.