Ram Charan: రామ్‌చరణ్ మెగా రివీల్: నెక్ట్స్ మార్వెల్ హీరో.. ఐరన్ మ్యాన్ vs కెప్టెన్ అమెరికా.. నేను నటించే సూపర్ హీరో క్యారెక్టర్ ఏంటంటే..

చరణ్ ని మీకు మార్వెల్ లో సూపర్ హీరో కారెక్టర్ చేయాలని ఉందని అడుగుతారు. అందుకు బదులుగా చెర్రీ తనకి టోనీ స్టార్క్ ( ఐరన్ మ్యాన్ ) కారెక్టర్ చేయాలని ఉందని అంటారు.

  • Written By:
  • Publish Date - January 11, 2023 / 03:44 PM IST

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రికి తగ్గ తనయుడిగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని కొనసాగిస్తున్న చరణ్ నటనలో, డాన్స్ లో , ఫైట్స్ లో అన్నింటా తనకు తానే అనే విధంగా దుమ్ము దులుపుతూ తనలోని నటుడిని పూర్తిగా ప్రదర్శిస్తున్నాడు. రంగస్థలం సినిమాతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించాడు.

తన నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు చరణ్(Ram Charan). అంతేకాకుండా మునుపటి సినిమాల కంటే ఆర్ఆర్ఆర్ లో చరణ్ పవర్ ఫుల్ లుక్‏లో కనిపించిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది మార్చి 25 వ తేదీ విడుదలయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు సృష్టించిందని చెప్పాలి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటించగా… అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని కీలక పత్రాలు పోషించారు.

ఐరన్ మ్యాన్ గా తారక్..

ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు బరిలో నిలిచిన ఈ సినిమా బెస్ట్ సాంగ్ కేటగిరీలో అవార్డును కైవసం చేసుకుంది. ఇది తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం అని అంతా మూవీ టీం ని అభినందిస్తున్నారు. ఆస్కార్ అవార్డుల్లో కూడా ఆర్ఆర్ఆర్ సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకి అవార్డు రావడం పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. మరోవైపు ఈ అవార్డు వేడుకల్లో భాగంగా రామ్ చరణ్ తేజ్ హాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు.

కెప్టెన్ అమెరికాగా రాంచరణ్

ఈ సంధర్భంగా ఓ రిపోర్టర్ చరణ్ ని మీకు మార్వెల్ లో సూపర్ హీరో కారెక్టర్ చేయాలని ఉందని అడుగుతారు. అందుకు బదులుగా చెర్రీ తనకి టోనీ స్టార్క్ ( ఐరన్ మ్యాన్ ) కారెక్టర్ చేయాలని ఉందని అంటారు. అందుకు తారక్ కూడా అదే జవాబు ఇచ్చారని రిపోర్టర్ చెప్పడంతో… అయితే కెప్టెన్ అమెరికా కారెక్టర్ చేస్తారని అంటారు. దీంతో చరణ్ చేసిన వ్యాఖ్యలని మెగా అభిమనులంతా పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా లో వైరల్ గా మారుస్తున్నారు. ఇప్పటికే చరణ్ ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా కారెక్టర్ లాగా చరణ్ ఫోటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియా లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మానియా నాడుస్తుందని చెప్పాలి.

 

ఇవీ చదవండి

NTR: ఆ విషయంలో ఎన్టీఆర్‌పై ఫుల్‌గా ట్రోలింగ్.. మన వాళ్ళని తక్కువ చేయొద్దంటూ వార్నింగ్

Package Star Jagan: ప్యాకేజీ స్టార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి: శవాలపై పేలాలు ఏరుకోవడం అంటే ఇదే.. ఇందుకే పవన్ కళ్యాణ్ తిట్టేది..

Ram Charan-Upasana: సైలెంట్‌గా ఉపాసన ఎంట్రీ.. భార్యను రాంచరణ్ ఎలా పరిచయం చేశాడో చూడండి..

Keeravani: ఈ అవార్డు నిజంగా వారికే దక్కాలంటూ గోల్డెన్ గ్లోబ్ వేడుకలో ఎమోషనల్ అయిన కీరవాణి

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/