Site icon Prime9

Ram Charan : రామ్ చరణ్ – రణవీర్ సింగ్ కలిసి చేస్తుంది మూవీనా ? సిరీస్ ఆ ??.. ట్రెండింగ్ గా ప్రోమో

ram charan and ranveer singh acting for bollywood film

ram charan and ranveer singh acting for bollywood film

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ “క్లిన్ కారా” రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న చరణ్ బాలీవుడ్ లో కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో తుఫాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ మరో సినిమా చేయలేదు. అయితే తాజాగా ఎవరూ ఊహించని విధంగా ఓ మూవీలో తళుక్కున మెరవడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. తాజాగా చరణ్ .. తన ట్విట్టర్ లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో దీపికా పదుకొనే, త్రిష, రణవీర్ సింగ్ తో పాటు తాను కనిపించాడు. దాంతో ఈ టీజర్ యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ గా దూసుకుపోతుంది. కాగా దీని గురించి జూలై 5 వ తేదీన రివీల్ చేయనున్నట్లు సమాచారం అందుతుంది.

ఇక ఆ వీడియో గమనిస్తే.. ” రాత్రి నుంచి నా భర్త కనిపించడం లేదు” అంటూ దీపికా ఏడుస్తూ చెప్పడంతో వీడియో మొదలయ్యింది. అంతలోనే రణవీర్ టార్గెట్ కనిపించాడు అనగానే ఏజెంట్ గా చరణ్ రంగంలోకి దిగాడు. ఇక చివర్లో త్రిష.. పోలీస్ స్టేషన్ లో నిస్సహాయంగా చూస్తూ ఉంటుంది. కొన్ని రహస్యాలు ఎప్పటికి రహస్యాలుగానే ఉండిపోతాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతక్కుండా వదిలేస్తేనే బెటర్.. కొన్ని మిస్టరీలను కనుక్కోకుండా వదిలేస్తేనే బెటర్ అంటూ ముగిసింది.

ఆ మధ్య రామ్ చరణ్ (Ram Charan) – గేమ్ చెంజర్ మూవీ ఓపెనింగ్ కి రణవీర్ గెస్ట్ గా రాగా.. ఇద్దరు కలిసి ఫోజులిచ్చిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నటించబోతున్నారా ? అంటూ ఫుల్ గా పోస్ట్ లు పెడుతున్నారు.

Exit mobile version