Site icon Prime9

Prabhas: రాంలీలా మైదానంలో ప్రభాస్ రావణ దహనం

prabhas ravana davanam in Ramlila ground

prabhas ravana davanam in Ramlila ground

Prabhas: దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరాభిమానాలను కైవసం చేసుకుంది. కాగా రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ మూవీని ఓం రౌత్ రూపొందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రను పోషిస్తున్నాడు. అందువల్ల ప్రభాస్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంతో విజయ దశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. హీరో ప్రభాస్ ఈ ఉత్సవాల్లో భాగంగా బాణం ఎక్కుపెట్టి రామ్ లీలా మైదానంలో రావణుడిని దహనం చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలు దేశాల రాయబారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ ఫరిస్థితుల్లో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. అందువల్ల కమిటీ నిర్వహకులు ఈ సారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో హీరో ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇదీ చదవండి: ధనుష్, ఐశ్వర్య విడాకులు కాన్సిల్.. రజినీ ఇంట సంబరాలు..!

Exit mobile version