Site icon Prime9

Pm Narendra Modi : ఫామ్ హౌజ్ సీఎం మనకు అవసరమా? – ప్రధాని మోదీ

pm narendra modi speech at mahaboobabad meeting

pm narendra modi speech at mahaboobabad meeting

Pm Narendra Modi : బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతుంది. అందులో భాగంగానే పార్టీ అగ్ర నేతలంతా రాష్ట్రంలో వరుసగా ప్రచారం చేస్తూ ఫుల్ జోష్ నింపుతున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఇప్పటికే పలుసార్లు పర్యటించగా.. ప్రస్తుతం ప్రచారం చివరి దశకు చేరుకున్నందున మూడు రోజులు వరుసగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది.

నేడు ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ మహబూబాబాద్ లో బహిరంగ సభలో పాల్గొన్నారు. నా కుటుంబ సభ్యులారా.. అంటూ తెలుగులో ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒక జబ్బును వదిలించుకుని మరో రోగాన్ని తగిలించుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ నాశనం చేశాయన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించాలని నిర్ణయించుకున్నారన్నారు. ఈ రోజుతో తెలంగాణలో తన మూడు రోజుల పర్యటన ముగుస్తుంది అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు బీజేపీ సత్తా ముందే తెలిసి, నన్ను కలిసి నాతో చేతులు కలపడానికి ప్రాదేయపడ్డారు. కానీ మేము అందుకు వ్యతిరేకించాం. కేసీఆర్ అభ్యర్థనను ఎప్పుడైతే తిరస్కరించామో.. అప్పటినుంచి నన్ను తిట్టడం మొదలు పెట్టింది. ఏ చిన్న అవకాశం దొరికినా నన్ను తిడుతోంది అని ఫైర్ అయ్యారు.

తెలంగాణకు తరువాతి ముఖ్యమంత్రి బీజేపీ నుంచేనని.. బీసీ వ్యక్తినే బీజేపీ ముఖ్యమంత్రిగా చేస్తుందని మోదీ (Pm Narendra Modi) తెలిపారు. ‘మోదీ గ్యారంటీ అంటే.. గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ..’ అంటూ తెలుగులో చెప్పడంతో సభలో ఒక్కసారిగా హర్షద్వానాలు చెలరేగాయి. ‘తెలంగాణకు అలాంటి ఫార్మ్ హౌస్ సీఎం అవసరమా..’ అంటూ మధ్యలో తెలుగులో మరో చురక అంటించారు. ప్రతీ కోనా ఒకటే గానా.. బీజేపీ పర్ తెలంగాణా అంటూ తెలుగును మిక్స్ చేసి మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది. ‘నీళ్లు, నియామకాలు, నిధులు’.. ఇస్తానన్నాడు. కానీ.. ‘కన్నీళ్లు’ ఇచ్చాడు, మోసాలు ఇచ్చాడు అంటూ తెలుగు డైలాగ్ లతో విమరసస్యలు గుప్పించారు.

బీఆర్ఎస్ నాలుగు చక్రాలు, ఓ స్టీరింగ్.. కాంగ్రెస్ హస్తం రెండూ ఒకటే.. రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయన్నారు. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతోందన్నారు. కుంభకోణాలకు పాల్పడ్డవారికి ఎవ్వరినీ ఉపేక్షించమన్నారు. అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ అవినీతిని బట్టబయలు చేస్తామన్నారు. నీటి ప్రాజెక్టుల్లో చేసిన అవినీతిని, డబుల్ బెడ్రూం ఇళ్లనిర్మాణంలో జరిగిన అవినీతిని, భూకుంభకోణాలను బద్దలు కొడతామన్నారు.

Exit mobile version
Skip to toolbar