Janasena Yuvashakthi: మూడు ముక్కల ప్రభుత్వం.. మూడు ముక్కల ముఖ్యమంత్రి

"నాకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఉత్తరాంధ్ర గడ్డపైనే నటనలో ఓనమాలు దిద్దుకున్నాను. ఆట, పాట, కవిత, కళ అన్నీ ఉత్తరాంధ్ర నేర్పినవే. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ పాడిన వంగపండు వంటి వారు నాకు స్ఫూర్తి.

  • Written By:
  • Updated On - January 12, 2023 / 08:21 PM IST

Janasena Yuvashakthi: “నాకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఉత్తరాంధ్ర గడ్డపైనే నటనలో ఓనమాలు దిద్దుకున్నాను. ఆట, పాట, కవిత, కళ అన్నీ ఉత్తరాంధ్ర నేర్పినవే. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ పాడిన వంగపండు వంటి వారు నాకు స్ఫూర్తి. యే మేరా జహా… ఏ మేరా ఘర్ ఏ మేరా ఆషియా అన్నా గానీ ఆ చైతన్యం నాకు వచ్చింది ఉత్తరాంధ్రలోనే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని భావించే విశాఖ ఉక్కు కార్మికులు నేను నటన నేర్చుకునే సమయంలో నాకు అండగా నిలబడ్డారు” అని వివరించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు. జిల్లాలోని లావేరు మండలం తాళ్లవలస పంచాయితీ పరిధిలో 35 ఎకరాల ప్రైవేటు స్ధలంలో పవన్ సభ నిర్వహిస్తున్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకొని సభావేదికకు వివేకానంద వికాస వేదికగా నామకరణం చేశారు. ఈ వేదికగా పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై, వైసీపీ నేతలపై ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు.

ఇవాళ తిట్టడానికి ఈ సభ పెట్టలేదని, తనకున్నదల్లా సగటు మనిషి తాలూకు ఆలోచనే అని స్పష్టం చేశారు. “ఈ దేశం నాకు ఎందుకు సహకరించదు, ఎందుకు నాకోసం నిలబడదు అని ప్రతి సగటు మనిషిలోనూ కోపం ఉంటుంది. నేను కూడా అలాంటి సగటు మనిషినే. నాలోనూ అలాంటి ప్రశ్నలే తలెత్తాయి. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదన్నారు.

ఆయన మూడు ముక్కల సీఎం..

అసలే రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్.. ఇది మూడు ముక్కల ప్రభుత్వం.. ఆయన మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు.  నేను కులం కోసం వచ్చిన వాడిని కాదు.. నా తెలుగు నేల, నా దేశం బాగుండాలని రాజకీయాల్లోకి వచ్చానన్నారు పవన్.  జైలుకెళ్లిన ఖైదీ నెంబర్ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎలా ? ఖైదీ నంబర్ 6093కి సెల్యూట్ కొట్టడం నా వల్లకాదు.. పోలీసునైతే చచ్చిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా

మీ అందరికీ జీవితాన్ని జుర్రేయాలని ఉంది. మట్టిపాత్రలో అన్నంపెట్టినా తింటా. లేకపోతే పస్తులుంటా. సినిమాలు పోతే మూసుకు కూర్చుంటాను.. నా మట్టికోసం నేను వచ్చాను. పోలీసుకేసులు, జైళ్లు అంటే భయం లేదు. సంబరాల రాంబాబు చాలా తెలివిగా, ముదురుముఖం వేసుకుని మాట్లాడతాడు. ఈ పిచ్చికూతలు మానేసి పనులు చూడండి. నన్ను మాట్లాడిన ప్రతీ ఒక్కరిని నేను మరిచిపోను.. నా వాళ్లు మరిచిపోరు అంటూ వపన్ యువశక్తి సభావేదికగా హెచ్చరించారు.

 

ఇవి కూడా చదవండి:

కానిస్టేబుల్ కొడుకు పార్టీకి.. సైకిల్ మెకానిక్ కొడుకు మద్దతు

ఫస్ట్ టైం.. ఉత్తరాంధ్ర కళాకారులతో కలసి స్టేజిపై డ్యాన్స్ చేసిన పవన్ కళ్యాణ్

Janasena Yuvashakthi: నేను కులనాయకుడిని కాదురా సన్నాసుల్లారా.. వైసీపీ నేతలపై జనసేనాని ఫైర్

Janasena Yuvashakthi: జనసేన పార్టీ పెట్టినప్పుడు నా అకౌంట్‌లో ఉన్నది రూ.13 లక్షలే.. పవన్ కళ్యాణ్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

 

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/