Site icon Prime9

Pawan Kalyan : OG సెట్ లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అన్న స్వాగ్ నెక్స్ట్ లెవెల్

pawan kalyan joins in sujith og shooting at mumbai

pawan kalyan joins in sujith og shooting at mumbai

Pawan Kalyan : ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ).  కాగా మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ముగింపు దశకు చేరుకోగా, తమిళ దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీలో తన పాత్రకు సంబంధించిన షూట్‌ను ముగించాడు. ఇక హరీష్‌ శంకర్‌ తో చేస్తున్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తయ్యింది. వీటికి తోడు యంగ్ డైరెక్టర్ సుజిత్ తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా ఇటీవలే స్టార్ట్ అయినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. కాగా ఇప్పుడు తాజాగా ఫ్యాన్స్ అందరికీ గూస్ బంప్స్ ఇచ్చే న్యూస్ ని అభిమనులతో పంచుకున్నారు.

ఓజీ ఘాట్ లో పాల్గొన్న పవన్ స్టార్ (Pawan Kalyan)..

అయితే, తాజాగా పవన్ ఈ చిత్ర షూటింగ్‌లోకి పవర్‌ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఈ విషయాన్ని వెల్లడించింది.  #OG HAS ARRIVED on sets… అంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి ట్వీట్ చేశారు. అలానే ఓ ఫోటోను కూడా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో పవన్ కళ్యాణ్, తన ట్రేడ్ మార్క్ బ్లాక్ హుడి వేసుకోని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. లైట్ బియర్డ్ తో, గాగుల్స్ పెట్టుకోని పవన్ కళ్యాణ్ పంజా సినిమా వైబ్స్ ని ఇస్తున్నాడు. వేట మొదలు పెట్టడానికి వస్తున్న ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. కాగా, ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటించనున్నట్లు సమాచారం అందుతుంది.

కాగా ఈ సినిమా కోసం ముంబైలో ప్రత్యేకంగా సెట్‌ కూడా వేశారు. ఇటీవల దీనికి సంబంధించిన టెస్ట్ షూట్‌ కూడా జరిగింది. పవన్‌ కళ్యాణ్‌ సెట్‌లోకి అడుగుపెట్టాక ఉన్న సమయంలో ఎంత ఎక్కువ సీన్లు తీయోచ్చు అనే దానిపై దర్శకుడు సుజీత్‌ అండ్‌ టీమ్‌ ఇటీవల టెస్ట్ షూట్‌ చేసిందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ టెస్ట్ ఘాట్ కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారని ఇన్ సైడ్ టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ప్రారంభమయ్యే రెగ్యూలర్‌ షూట్‌ని ఫాస్ట్ గా చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. మొత్తానికి అయితే వరుస అప్డేట్ లతో సుజిత్ సినిమాపై భారీ ఆంచానలు నెలకొంటున్నాయి. ఫ్యాన్ తన ఫేవరెట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. దీంతో ఈ చిత్రం కూడా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.

 

Exit mobile version