Janasena : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరాచకపూ పాలనను ఎండగట్టేలా యువత అంతా గళం విప్పాలని జనసేన పిలుపునిస్తుంది. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో అధికార వైసీపీని బలంగా ఢీ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్టు గానే వరుస కార్యక్రమాలతో జన సైనికుల్లో జోష్ నింపుతున్నారు. ఒకవైపు ప్రజావాణి, కౌలు రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తూనే తాజాగా “యువశక్తి ” కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ఈ మేరకు రణస్థలంలో ‘యువశక్తి’తో తడాఖా చూపుదాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర యువతను ఒకేచోటకు తీసుకొచ్చేలా, ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా, సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని నేతలు చెబుతున్నారు. ఇటీవలే ఈ సభకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
కాగా ఇప్పుడు యువతకు జనసేన పార్టీ తరుపున ఓ మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. సామాన్య యువతీ, యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నారు. దీనిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీలోపు యువతీయువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు అని ప్రకటించారు. మీ పేరు, వివరాలు నమోదు చేయాల్సిన ఫోన్ నంబరు 08069932222, ఈ– మెయిల్ vrwithjspk@janasenaparty.org కు యువతీయువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి వివరాలను పంపి జనసేనాని సమక్షంలో మీ గలాన్ని వినిపించండి అని వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వంపై, శ్రీ జగన్ రెడ్డి పాలనపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో నమ్మకం పోయింది. రాజకీయ స్వలాభం కోసం ఈ ప్రాంత యువతలో ఉన్న శక్తి, నైపుణ్యాన్ని నిర్వీర్యం చేశారు. యువ శక్తిలో మీ గళం వినిపించండి మనం చెప్పగానే ఒక్క రోజులోనే 3741 ఫోన్ కాల్స్, దాదాపు 1400 ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం యువత ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోందని అన్నారు.
యువ గళాన్ని వినిపించడమే లక్ష్యంగా జనసేన పార్టీ జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో తలపెట్టిన ‘యువ శక్తి’ కార్యక్రమంలో సామాన్య యువతీ, యువకులు వేదిక నుంచి మాట్లాడేందుకు అవకాశం
*దీనిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీలోపు యువతీయువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. pic.twitter.com/17WQKZtSvh
— JanaSena Party (@JanaSenaParty) January 5, 2023