Site icon Prime9

Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..

nandamuri balakrishna open about his dream project

nandamuri balakrishna open about his dream project

Nandamuri Balakrishna :  నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమాని మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేశాడు. శృతిహాసన్, హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వీరసింహారెడ్డి చిత్ర బృందం కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యి సందడి చేశారు.

ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ బి గోపాల్ వచ్చాడు. ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ.. ఈరోజు మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చిన దర్శకుడు, మా కుటుంబ సభ్యుడు బి గోపాల్ గారికి కృతజ్ఞతలు. అయన నాకు అందించిన సినిమాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయిన సినిమాలు. ఈ సభకి ఎవర్ని ముఖ్య అతిధిగా పిలిస్తే బాగుంటుంది అని నన్ను అడిగారు. ఈ వీరసింహారెడ్డి వేదికకు ఎవరన్నా పెద్దరికం తీసుకువచ్చే వారు ఉన్నారు అంటే అది బి గోపాల్ గారు మాత్రమే అన్నాను. ఆయన కూడా ఒంగోలియనే అని సరదాగా వ్యాఖ్యానించారు.

డే విధంగా బాలకృష్ణ మాట్లాడుతూ తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి బయటపెట్టారు. “ఒంగోలియన్ అంటే గుర్తుకు వచ్చింది. నాకు మంగోలియన్ అయిన చెంఘీజ్ ఖాన్ పాత్రలో నటించాలి అని ఉంది. చెంఘీజ్ ఖాన్ సినిమా చేయాలనేది  నా జీవిత ఆశయం. ఎప్పటికైనా చేస్తా. దేనికైనా సమయం రావాలి అంతే” అంటూ చెప్పుకొచ్చారు.  కాగా ఈ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో బాలకృష్ణ ఫ్యాక్షన్ యాక్షన్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

ఇవి కూడా చదవండి…

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్

Hyderabad Costly Dog: హైదరాబాద్‌లో రూ. 20 కోట్ల విలువైన కుక్క.. ఇందులో నిజమెంత..?

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version