Viveka Murder Case : వివేకా మర్డర్ కేసులో మూడోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అదికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.

  • Written By:
  • Updated On - March 10, 2023 / 06:05 PM IST

Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అదికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు. తనను న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పిటిషన్ లో కోరారు. అంతేకాదు తన విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా వైఎస్ అవినాష్ రెడ్డి ఆ పిటిషన్ లో కోరారు. మరోవైపు  అవినాష్ రెడ్డి దాఖలు  చేసిన  పిటిషన్ పై  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి  ఇంప్లీడ్  పిటిషన్ ను దాఖలు  చేశారు. అవినాష్ రెడ్డి  పిటిషన్ లో  తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు  చేసిన నేపథ్యంలో తన వాదనలను కూడా వినాలని ఆ పిటిషన్ లో  ఆమె కోరారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/