Maha Sivaratri : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. వేకువజామునే భక్తులు శైవక్షేత్రాల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామస్మరణ చేస్తున్నారు. శివయ్యకు రుద్రాభిషేకం, బిల్వార్చనలు జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు వేకువజాము నుంచే తరలిరావడంతో ఇరు రాష్ట్రాల్లోని శివాలయాల్లో రద్దీ నెలకొంది.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైలాస నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలైన శ్రీశైలం, ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తితోపాటు వేములవాడ, కాళేశ్వరం, కీసరకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మహాశివరాత్రి (Maha Sivaratri) పూజా విధానం..
మహాశివరాత్రి రో్జున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఈ రోజున ఆకుపచ్చని దుస్తులు ధరించడం శుభపద్రం. ఆ తరువాత శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన నీరు, చెరుకు రసం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన వాటితో శివలింగానికి అభిషేకం చేయాలి. పండ్లు, స్వీట్లు మొదలైన వాటిని దేవునికి సమర్పించాలి. చివరిగా శివ చాలీసా చదవాలి. శివుని మంత్రాలను పఠించండి, శివుని ఆరతి పాడటం చేయాలి.
శివ పురాణం ప్రకారం.. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి, నీటిని కూడా సేవించకుండా శివుడిని పూజించిన భక్తులు సకల సంతోషాలను పొందుతారు. మహాశివరాత్రి ఉపవాసం అనేక రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. మహాశివరాత్రి రోజున శివలింగాన్ని పూజించడం ద్వారా జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. శివలింగంపై బెల్పాత్రను సమర్పించడం ద్వారా వ్యాపారంలో పురోగతి లభిస్తోంది.
శివుని పూజకు ఏ పుష్పాలను సమర్పించాలి.. వేటిని సమర్పించకూడదంటే?
శివలింగ పూజలో ధాతుర పుష్పం, తెలుపు రంగు పుష్పాలను వినియోగించడం చాలా శ్రేయస్కరం.
మహాశివరాత్రి రోజున శివునికి కేతకీ పుష్పాలను పూజలో సమర్పించకూడదు.
అంతేకాక.. కనేర్, తామర, ఎరుపు రంగు పుష్పాలను కూడా శివలింగంపై సమర్పించకూడదు.
శివుడి సిగలోని నెలవంక సృష్టికి, మనసుకి ప్రతీక. మనసుతో ప్రయత్నించి మార్గాన్ని అన్వేషించాలని చెప్పడమే నెలవంక దాల్చడంలో అంతరార్థం. జటాజూటంలో కిరీటాన్ని తలపించే తుమ్మి పత్రాలు గ్రహాల చలనానికి సూచికలు. చేతనున్న డమరుకం జీవసృష్టికి సంకేతం. ఇది దిశా నిర్దేశం చేస్తుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే నానుడికీ, నటరాజ నృత్యానికీ అవినాభావ సంబంధం ఉంది. ఎలాగంటే విశ్వంలో చరాచరాలన్నీ పరమాత్మ ఆదేశంతోనే కర్మలను అనుసరిస్తున్నాయి, విధులను నిర్వర్తిస్తున్నాయి. నటరాజ నాట్య భంగిమలే జీవుల కదలిక. అది ఆగిందంటే సృష్టి స్తభించిపోవడం తథ్యం అని పురాణాలు తెలుపుతున్నాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/