Site icon Prime9

Komatireddy Venkat Reddy: రేవంత్‌ రెడ్డి ముఖం చూడను.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Hyderabad: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం పై ఆయన ఫైరయ్యారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. చెరుకును చేర్చుకునే విషయంలో రేవంత్‌ రెడ్డి పెద్ద తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై ఆయన ముఖం చేసేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానని చెప్పారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ నేడు కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ విధంగా స్పందించారు.

మరోవైపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ మారేందుకు సిద్దమైయ్యారని ప్రచారం జరుగుతోంది. అందుకు ఈ ఫోటోనే సాక్షం మంటున్నారు పలువురు జోష్యం చెబుతున్నారు

Exit mobile version