Site icon Prime9

Komati reddy Venkat Reddy: నేను కాంగ్రెస్ లో చేరినపుడు రేవంత్ రెడ్డి పుట్టలేదు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

komatireddy

komatireddy

Hyderabad: కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం పై తానేమీ స్పందించబోనని ఆయన సోదరుడు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆఫీసును ఈడీ సీజ్ చేయడంపై ఢిల్లీలో ఎంపీలు ధర్నా చేశారు. ఈ ధర్నాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. తన సోదరుడి పార్టీ మార్పు గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడేందుకు నిరాకరించారు. తన పేరు వెంకటరెడ్డి అని ఏమైనా ఉంటే రాజగోపాల్ రెడ్డినే అడగాలని తేల్చేశారు. తాను నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తనన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌కు సీల్ చేస్తే నిరసన వ్యక్తం చేయడానికి తెలంగాణలో ఉన్న ముగ్గురు ఎంపీల్లో తాను ఒక్కడినే వచ్చానన్నారు.

అయితే రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాజగోపాల్ రెడ్డికి బ్రాందీషాపుల్లో కూడా పని దొరకదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇలా విమర్శించడం ఏమిటని వెంకటరెడ్డి ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయనను విమర్శించాలి కానీ, రేవంత్ కుటుంబాన్ని విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. మీరు అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయబోనని, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రకటించారు. తనను అనవసరంగా రెచ్చగొట్టవద్దని, తాను ఒక్క మాట కూడా పడనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెబితే అది చేస్తానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో పని చేసే సమయానికి రేవంత్ రెడ్డి పుట్టలేదన్నారు.

Exit mobile version