Site icon Prime9

Minister Roja: రోజా నువ్వు పర్యాటక మంత్రివా.. పవన్‌ను తిట్టడానికి మంత్రివా? – జనసేన శివపార్వతి ఆగ్రహం

janasena supporter fire on minister roja and video goes viral

janasena supporter fire on minister roja and video goes viral

Minister Roja : రోజా సెల్వమణి.. వైసీపీ వారు ఈవిడని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తారు, సినిమా వాళ్ళు హీరోయిన్ రోజా అంటారు, గతంలో ఆవిడ ఏ పార్టీ నుండి పోటీ చేస్తే ఆ పార్టీతో పాటు ఆమె ఓడిపోడంతో ప్రతిపక్ష పార్టీలు ఐరన్ లెగ్ రోజా అని పిలిచేవారు. అయితే రోజా వైసీపీకి వచ్చాక మాత్రం ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ 2014 ఎన్నికల్లో గెలిచింది.

అయితే, తాజాగా ఆవిడ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మెగా బ్రదర్స్ ముగ్గురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు మంత్రి రోజా.

దీనిపై జనసేన వీరమహిళ శివ పార్వతి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ..  “జగన్ గారు పవన్ కళ్యాణ్ ని తిట్టించడానికే రోజా (Minister Roja)తో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు, ఆవిడ డబ్బుల కోసం సిగ్గు శరం, నీతి జాతి వదిలేసి ఎంత కక్రుత్తి పని అయినా చేస్తుంది” అని అన్నారు.

‘‘పవన్ కళ్యాణ్ కి మానవత్వం లేదు అంటావు, ఆత్మహత్యలు చేసుకున్న 3000 మంది రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేస్తుంటే కళ్ళల్లో ఏం తుమ్మ మొద్దులు పెట్టుకున్నావు’’ అని ఆవిడ ప్రశ్నించారు.

‘‘ఆర్టిస్టుగా పవన్ కళ్యాణ్ ని చూసి ఎందుకు సిగ్గు పడుతున్నావు నీలాగా జబర్దస్త్ షోలు చెయ్యలేదనా జబ్బలు పిసకలేదనా లేకపోతే నీలాగా బట్టలిప్పి రికార్డింగ్ డాన్సులు వెయ్యలేదనా’’ అని ఆవిడ ఘాటు విమర్శలు చేశారు.

‘‘పవన్ కళ్యాణ్ కి రాజకీయ భవిష్యత్తు లేదు అంటావు ముందు నీ భవిష్యత్తు చూసుకో.. ప్రజల్లోకి వెళ్తే ఈడ్చి ఈడ్చి తంతారు’’ అని హెచ్చరించారు.

మంత్రిగా, ఎమ్మెల్యేగా సాధించింది ఏంటి?

‘‘మెగా ఫామిలీ చేసిన సేవల్లో నీ జీవితం మొత్తం మీద 10% చేయగలవా, మెగా ఫామిలీ చేసే సేవలు నీకు కనపడట్లేదా జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులే నీకు కనపడుతున్నాయా’’ అని ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు దఫాలుగా రోజాని గెలిపించిన నగరి ప్రజలకి ఆవిడ ఎం చేసిందో చెప్పని సవాల్ చేశారు.

గత కొంతకాలంగా రోజా పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారు. దీంతో జనసేన నాయకులు, కార్యకర్తలు సైతం రోజాను టార్గెట్ చేస్తున్నారు.

జనసేన కీర్తన సైతం రోజాను టార్గెట్ చేస్తూ.. రోజాను నోటి పారుదల శాఖ మంత్రిగా అభివర్ణించారు.

వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవిని ఆశించినప్పటికీ రోజాకు మొదటి విడత మంత్రివర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు.

అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని పొగడ్తల్లో ముంచెత్తే రోజాను ఒకానొక దశలో స్పీకర్ కూడా అదుపు చేయాల్సి వచ్చింది.

పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా రాష్ట్రానికి, తన సొంత నియోజకవర్గమైన నగరికి శాఖాపరంగా ఏం చేశారని చాలామంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.

 

ఇవి కూడా చదవండి:

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

 

Exit mobile version