Janasena Pawan Kalyan : చిందేపల్లిలో జనసేన నేతల దీక్షను భగ్నం చేసిన తీరు ఆక్షేపణీయమన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. మూడు రోజులుగా చేస్తున్న నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసిన తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ముఖ్యంగా జనసేన నాయకురాలు కోట వినుత, ఆమె భర్త పట్ల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన గొంతెత్తడమే నేరం అన్నట్లు వైసీపీ ప్రజా ప్రతినిధులు వ్యూహరచన చేస్తూ అధికార గణాన్ని నడిపిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరాహార దీక్ష చేస్తున్నవారిపై బల ప్రయోగం చేయడమే కాకుండా వారిపై 307, ఎస్సీ, ,ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ వంటి బలమైన 14 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారన్నది సుస్పష్టమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలంతా అర్ధం చేసుకుంటున్నారన్నారు. అదుపులోకి తీసుకున్న జనసేన నాయకులను ఈ రోజు ఇళ్లకు పంపించారని ఆయన అన్నారు. అదే విధంగా గ్రామస్తుల కోరిక మేరకు రహదారిని పునరుద్ధరించాలని ఆయన కోరారు. కేసులన్నీ తక్షణం ఉపసంహరించుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. చిందేపల్లి వాసులకు జనసేన భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
దీక్షను భగ్నం చేసిన తీరు ఆక్షేపణీయం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/EmwuU7UFoV
— JanaSena Party (@JanaSenaParty) March 30, 2023
శ్రీకాళహస్తి.. ఏర్పేడు మండలాల సరిహద్దులో స్టీల్ కాస్టింగ్స్ పరిశ్రమ నడుస్తోంది. ఈ పరిశ్రమ మధ్యలో ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామానికి దారి ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే.. పరిశ్రమ విస్తరణలో భాగంగా.. ఆ దారిని యాజమాన్యం మూసివేయించింది. దీంతో తాము ఎంతో కాలంగా వినియోగిస్తున్న దారిని మూసివేయడంపై చిందేపల్లి గ్రామస్తులు ఆందోళనలు చేస్తున్నారు. అధికారులను కూడా ఆశ్రయించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో రాజకీయ నాయకులను ఆశ్రయించారు. కాగా వారికి జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ వినూత మద్దతు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో.. ఈనెల 27వ తేదీ నుంచీ వినూత గ్రామస్తులతో కలసి శివాలయం వద్ద నిరాహార దీక్షకు దిగారు. అయితే.. సోమవారం నాటికి ఆమెతో పాటు దీక్షలో ఉన్న గ్రామస్తుల ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు ఆ గ్రామానికి చేరుకొని జనసేన మహిళా నేత వినూతను అంబులెన్సులో ఎక్కించి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.
*చిందేపల్లి గ్రామస్థులతో కలిసి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు నిరాహార దీక్ష*#nomorechancejagan@JanaSenaParty । @PawanKalyan । @mnadendla । @NagaBabuOffl । @Cbn_Kota । @JSPShatagniTeam pic.twitter.com/IcyEucihQA
— Vinutha Kotaa (@VinuthaKotaa) March 27, 2023
కౌలు రైతుల కష్టాలకు వైకాపా ప్రభుత్వ విధానాలే కారణం (Janasena Pawan Kalyan)..
అదే విధంగా మరో ప్రెస్ నోట్ లో.. రాష్ట్రంలో మూడువేల మంది కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకున్నా వైకాపా ప్రభుత్వంలో కనీస చలనం లేదని పవన్ ఫైర్ అయ్యారు. కౌలు రైతుల కష్టాలకు రాష్ట్రప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. ‘రైతుల కష్టాలపై త్వరలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిద్దాం. రాష్ట్రంలో 80 శాతం వరి పంట కౌలు సేద్యం నుంచే వస్తుంది. వరితో పాటు మిర్చి, పత్తి వేసిన వారూ నష్టపోతున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’ అని పవన్ తెలిపారు.