Site icon Prime9

Janasena Party : గంగమ్మకు అండగా నిలిచిన జనసేన.. రూ.4లక్షలు చెక్ అందించిన నాదెండ్ల మనోహర్..

janasena party financial help to sattenapalli check issue victim

janasena party financial help to sattenapalli check issue victim

Janasena Party : రాష్ట్రంలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో కుమారుడ్ని పోగొట్టుకుని పరిహారంగా వచ్చిన డబ్బులో వాటా ఇవ్వాలని మంత్రి అంబటి రాంబాబు తమను బెదిరించారని గంగమ్మ అనే మహిళ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కుమారుడు చనిపోతే సీఎం సహాయ నిధి నుంచి రూ. ఐదు లక్షలు వచ్చాయని.. అందులో రెండున్నర లక్షలు అంబటి అడిగారని.. ఎందుకివ్వాలని ప్రశ్నించిన తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని గంగమ్మ మీడియా ముందుకొచ్చి చెప్పింది. ఈ వార్త గత కొన్ని రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పుడు తాజాగా గంగమ్మకు జనసేన పార్టీ అండగా నిలిచింది. ఆమెను ఆర్ధికంగా భరోసా కల్పిస్తూ.. రూ.నాలుగు లక్షల చెక్కును అందజేసింది. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ చెక్కును స్వయంగా గంగమ్మకు అందజేశారు. అనంతం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. కుమారుడిని కోల్పోయిన తల్లిపై కక్ష సాధింపు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదన్న అహంకార ధోరణి వైసీపీ నాయకుల్లో విపరీతంగా పెరిగిపోయిందని నాదెండ్ల మనోహర్ అన్నారు. కమీషన్ ఇవ్వలేదన్న ఒకే ఒక్క కారణంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పేద మహిళకు వచ్చిన పరిహారం చెక్కును వెనక్కి పంపి మంత్రి అంబటి రాంబాబు తనలోని రాక్షసత్వాన్ని బయటపెట్టారని ఫైర్ అయ్యారు. పరిహారం సొమ్ములో వాటా తీసుకునే దౌర్భాగ్యం తనకు పట్టలేదని మాయమాటలు చెప్పిన రాంబాబు చెక్కు వెనక్కి ఎందుకు వెళ్ళిందో చెప్పాలన్నారు. మంత్రి దౌర్జన్యాలకు గురై భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న గంగమ్మ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పల్నాడు ప్రాంతంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ప్రశ్నించే వారిని భయబ్రాంతులకు గురి చేయడానికి పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ముఖ్యంగా జన సైనికులపై ఇష్టానుసారం అక్రమ కేసులు పెడుతున్నారు. ప్లెక్సీలు కట్టినా, పూజలు నిర్వహించినా, చివరకు గణపతి నిమజ్జనం సమయంలో కేసులు పెట్టారు. ఎవరూ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించకూడదన్న ధోరణిలో నాయకులు వ్యవహరిస్తున్నారు.

 

 

చెక్ వచ్చిన దగ్గర నుంచి వేధించడం మొదలుపెట్టారు..

గత ఏడాది ఆగస్టు 20వ తేదీన సత్తెనపల్లిలో ఒక రెస్టారెంటులో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయడానికి వెళ్లి గంగమ్మ కుమారుడితో పాటు మరొకరు మృతి చెందారు. కేసు సద్దుమణిగించడానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రాంబాబు బాధిత కుటుంబాలతో మాట్లాడి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 4వ వారంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి గంగమ్మ పేరు మీద రూ. 5 లక్షల చెక్ విడుదలైంది. అప్పటి నుంచి రూ. రెండున్నర లక్షలు వాటా ఇవ్వాలని ఆమెను వేధించడం మొదలుపెట్టారు. అధికారులు, స్థానిక నాయకులు, చివరకు రాంబాబు దగ్గరకు వెళ్లినా బాధితురాలికి న్యాయం జరగలేదు. డిసెంబర్ 15వ తేదీన ఆమె నా దగ్గరకు వచ్చి జరిగిన వాస్తవాలను వివరించింది. మరుసటి రోజు సత్తెనపల్లిలో జరిగిన కౌలు రైతు భరోసా సభలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దీని గురించి ప్రస్తావించగానే రాంబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. మీడియా ముందుకు వచ్చి లంచం అడిగానని నిరూపిస్తే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. జనసేన పార్టీ బాధితులతో పాటు మీడియా ముందుకు వచ్చే సరిగా తనను అవినీతిపరుడిగా చిత్రీకరించే కుట్ర జరుగుతుందని ప్లేట్ ఫిరాయించారు.

రూ. 5 లక్షల పరిహారం చెక్ నవంబర్ లోనే గంగమ్మ పేరుతో విడుదలైనా ఇప్పటి వరకు ఆమెకు చేరలేదు. ఆర్డీవో ఆఫీసులో ఉందని కొన్ని రోజులు, కమిషనర్ దగ్గర ఉందని మరికొన్ని రోజులు తిప్పించారు. బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక జనసేన నాయకులు కూడా ఆర్డీవో కార్యాలయం ముందు ఆందోళన చేశారు. పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశారు. అయినా ఆమెకు న్యాయం జరగలేదు. మంత్రి రాంబాబు కుట్ర పూరితంగా ఫిబ్రవరి మూడో తేదీన బాధితులు అందుబాటులో లేరని చెప్పి చెక్ ను వెనక్కి పంపించారు. కమీషన్ ఇచ్చుకోలేను అని నిజాయితీగా చెప్పినందుకు ఆమెకు రావాల్సిన రూ. 5 లక్షల చెక్ ఇవ్వకుండా రాంబాబు అడ్డుపడ్డారు. దీనికి ఆయన నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అలాగే ఈ కుట్రలో భాగస్వాములైన అధికార యంత్రాంగంపై కూడా ప్రభుత్వం మారిన తరువాత చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి జగన్ స్పందించి బాధితులకు న్యాయం చేయాలి..

బాధితురాలని ఆదుకోవడం కోసం జనసేన పార్టీ తనవంతు ప్రయత్నం చేసింది. బాధితురాలి తరఫున చివర వరకు పోరాటం చేసింది. ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షల చెక్ వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటుంది. బాధితురాలికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలి. బాధిత మహిళను పిలుపించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన నిధులను ఆమెకు అందేలా చూడాలి. కక్షపూరితంగా వ్యవహరించిన మంత్రి రాంబాబుతో పదవికి రాజీనామా చేయించాలి” అని డిమాండ్ చేశారు. స్పందించే మనసు ఉన్నా.. కనీసం మానవత్వం ఉన్నా బాధితురాలు గంగమ్మను పిలిపించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version