Site icon Prime9

Janasena Chief Pawan kalyan : ట్విట్టర్ వేదికగా వైకాపా సర్కారుపై సెటైర్లు.. అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించిన జనసేనాని పవన కళ్యాణ్

janasena chieef pawan kalyan fires on ycp government

janasena chieef pawan kalyan fires on ycp government

Janasena Chief Pawan kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా  వైకాపా సర్కారుపై సెటైర్లు పేల్చారు. రుషికొండపై తవ్వకాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. చెట్లను నరికివేయడం.. కొండలు, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైఎస్సార్‌సీపీ దుష్ట పాలకుల హాల్ మార్క్ అంటూ ఫైర్ అయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రుషికొండను ధ్వంసం చేయడంలో నిబంధనల్ని ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం నిర్థారించిందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీనిపై సమాధానం చెబుతుందా.. లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తుందా అని ఎద్దేవా చేశారు.

 

అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం పైనా పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అంటే తెలుగు ప్రజలకు ఒక ఎమోషన్ అన్నారు. త్యాగానికి, గౌరవానికి ఆదర్శానికి గుర్తుగా ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలో సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. తమ అభ్యర్థలను పరిశీలించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

 

మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.

ఆ ప్రెస్ నోట్ లో (Janasena  Chief Pawan kalyan)..

‘నేను, నా దేశం.. ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది’ ఎంత గొప్ప మాటలు.. ఇంత మంచి మాటలు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు. రాజ్యాంగమనే మహా సూత్రాలను భరత జాతికి అందించి, ఈ దేశం సమైక్యంగా.. సమున్నతంగా.. సమభావంగా.. శక్తిమంతంగా.. ముందుకు సాగడానికి పద నిర్దేశం చేసిన దేశ భక్తుడు. శ్రీ అంబేద్కర్‌ వంటి మహా జ్ఞాని కోటికొక్కరు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నాను’ అన్నారు.

‘ముఖ్యంగా నాకు శ్రీ అంబేద్కర్‌ స్పూర్తి ప్రదాత. ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అధ్యయనం చేశాను. లండన్‌ లో ఒకప్పుడు ఆయన నివసించి, ఇప్పుడు స్మారక మందిరంగా రూపుదిద్దుకున్న గృహాన్ని సందర్శించాను. అదే విధంగా లక్నోలో గొప్పగా నిర్మితమైన ఆయన స్మారక మందిరాన్ని తిలకించాను. మరెన్నో విషయాలు తెలుసుకున్నాను. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. విద్యావేత్తగా.. మేధావిగా.. న్యాయకోవిదునిగా.. పాత్రికేయునిగా.. రాజకీయ నాయకునిగా… రాజ్యాంగ నిర్మాణ సారధిగా… న్యాయశాఖామంత్రిగా ఆయన ఈ దేశానికీ చేసిన సేవలు వెలకట్టలేనివి. విమర్శలకు వెరవని శ్రీ అంబేద్కర్‌ ‘ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే… నువ్వు విజయం సాధించబోతున్నావని అర్ధం అంటారు’

‘మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు, కాబట్టి పులుల్లా బతకండి”అని అణగారిన వర్గాలలో ధైర్యం నింపారు. అస్పృశ్యత, అంటరానితం నిర్మూలనకు తన జీవిత చరమాంకం వరకు అవిరళ కృషి చేసి అసామాన్యునిగా నిలిచారు. అందుకేనేమో ఆయన భారత రత్నగా ప్రకాశిస్తున్నారు. ఆ మహానుభావుని మూలసూత్రాలు ఆధారంగా జనసేన ప్రస్థానం చిరంతనంగా సాగుతుందని ప్రమాణం చేస్తూ… ఆయన బోధించిన ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అనే మాటలను మననం చేసుకుంటూ శాంతిమూర్తి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ గారికి నివాళి అర్పిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

 

‘నేను, నా దేశం.. ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది’ ఎంత గొప్ప మాటలు.. ఇంత మంచి మాటలు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కన్నా గొప్పగా ఎవరు చెప్పగలరు. రాజ్యాంగమనే మహా సూత్రాలను భరత జాతికి అందించి, ఈ దేశం సమైక్యంగా.. సమున్నతంగా.. సమభావంగా.. శక్తిమంతంగా… ముందుకు సాగడానికి పద నిర్దేశం చేసిన దేశ భక్తుడు. శ్రీ అంబేద్కర్‌ వంటి మహా జ్ఞాని కోటికొక్కరు. ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకుని వినమ్రంగా ప్రణామాలు అర్పిస్తున్నాను’ అన్నారు.

‘మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు, కాబట్టి పులుల్లా బతకండి”అని అణగారిన వర్గాలలో ధైర్యం నింపారు. అస్పృశ్యత, అంటరానితం నిర్మూలనకు తన జీవిత చరమాంకం వరకు అవిరళ కృషి చేసి అసామాన్యునిగా నిలిచారు. అందుకేనేమో ఆయన భారత రత్నగా ప్రకాశిస్తున్నారు. ఆ మహానుభావుని మూలసూత్రాలు ఆధారంగా జనసేన ప్రస్థానం చిరంతనంగా సాగుతుందని ప్రమాణం చేస్తూ.. ఆయన బోధించిన ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అనే మాటలను మననం చేసుకుంటూ శాంతిమూర్తి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కి  నివాళి అర్పిస్తున్నాను’ అంటూ ప్రకటన విడుదల చేశారు.

 

Exit mobile version