Site icon Prime9

IND Vs ENG 1st ODI Highlights: తొలి వన్డేలో దుమ్మురేపిన భారత్

Cricket: టీ20 సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియా తొలి వన్డేలోనూ దుమ్ము రేపింది. భారత బౌలర్లు బుల్లెట్ బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ భరతం పట్టారు. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. మొహ్మద్ షమీ మూడు వికెట్లతో చెలరేగడంతో, తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌటైంది. 19 పరుగులిచ్చి.. 6 వికెట్లు తీసిన బుమ్రా వన్డే కెరీర్‌ బెస్ట్ నమోదు చేశాడు.

లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఓపెనర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ అద్భుత బ్యాటింగ్‌తో అలరించారు.. రోహిత్ శర్మ 58 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేయగా, ధావన్ 54 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సంపాదించింది.

Exit mobile version