Site icon Prime9

Heavy Rains: తెలంగాణలో నేడు భారీ వర్షాలు

Hyderabad: తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ద్రోణి ఏర్పడి చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించినట్టు తెలిపింది. దీనికి తోడు తమిళనాడు పై 1500 మీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు ప్రకటించింది. వీటి ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, అధికారులు అంతా అప్రమత్తమయ్యారు.

Exit mobile version