Site icon Prime9

AAA Cinemas : అల్లు అర్జున్ చేతుల మీదుగా గ్రాండ్ గా ప్రారంభం అయిన “AAA సత్యం” సినిమాస్..

icon star allu arjun opened aaa satyam cinemas multiplex

icon star allu arjun opened aaa satyam cinemas multiplex

AAA Cinemas : ప్రస్తుతం సినిమా హీరోలు కూడా వ్యాపార రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే అల్లు అర్జున్ కూడా అఫిషియల్ గా యాతన బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్ లోని అమీర్ పేట ఏరియాలో నిర్మిస్తున్న “AAA సత్యం సినిమాస్” ని తాజాగా అల్లు అర్జున్ ప్రారంభించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా వచ్చారు. బన్నీ చేతులు మీదగా ఈ థియేటర్ ఓపెనింగ్ జరిగింది. రేపటి నుంచి ఈ థియేటర్ లో సినిమాలు ప్రదర్శించబోతున్నారు.

కాగా మొదటి సినిమాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “ఆదిపురుష్” రిలీజ్ కాబోతుంది. ఈరోజు నుంచి ఈ సినిమాకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ జరగనున్నాయి. ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం 5 స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. మొదటి స్క్రీన్.. బార్కో లేజర్ ప్రొజెక్షన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటే, సెకండ్ స్క్రీన్.. ఎపిక్ లుజోన్ స్క్రీన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటుంది. ఇక మిగిలిన మూడు స్క్రీన్స్.. 4K ప్రొజెక్షన్ తో ఉండబోతున్నాయి. అలాగే మొత్తం స్క్రీన్స్ Dolby 7.1 సౌండ్ తో రాబోతున్నాయి. అలాగే ఆసియన్ సత్యం మాల్ లో పాపులర్ ఫుడ్ బ్రాండ్స్ తో బిగ్ ఫుడ్ కోర్ట్ ని కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు.

కాగా అల్లు అర్జున్ వస్తున్నారని ముందుగానే తెలియడంతో అభిమనులంతా భారీ ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అమీర్ పేట రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి.  హైదరాబాద్ నగరంలో తొలినాళ్లలో నిర్మించిన 70ఎంఎం సినిమా థియేటర్లలో సత్యం ఒకటి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ సినిమా థియేటర్‌ స్థానంలో ఇప్పుడు ‘ఏషియన్ అల్లు అర్జున్ సత్యం థియేటర్’ని అందుబాటులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ లో మహేష్ బాబు తరువాత ఏషియన్ సినిమాస్ తో కలిసి అల్లు అర్జున్ మరో మల్టీప్లెక్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు థియేటర్ వద్దకి భారీగా తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తున్న అల్లు అర్జున్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

ఈ AAA సినిమాస్‌లో సునీల్ నారంగ్, అల్లు అర్జున్ భాగస్వాములు. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, రౌడీ హీరో విజయ్ దేవరకొండ సొంత థియేటర్లను నిర్మించుకున్న విషయం తెలిసిందే. ఏఎంబీ సినిమాస్ పేరిట మహేష్ బాబు గచ్చిబౌలిలో మల్టీప్లెక్స్ నిర్మించగా.. విజయ్ దేవరకొండ ఏవీడీ సినిమాస్ పేరుతో మహబూబ్ నగర్‌లో మల్టీప్లెక్స్ ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఐకాన్ స్టార్‌‌తో ఏషియన్ చేతులు కలిపి మరో మల్టీప్లెక్స్‌ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

Exit mobile version