Site icon Prime9

UNESCO: తెలంగాణలోని చారిత్రక కట్టడాలకు యునెస్కో అవార్డులు

Golkonda-steps well-and-domakonda-fort-won-unesco-awards

Golkonda-steps well-and-domakonda-fort-won-unesco-awards

UNESCO: తెలంగాణలోని మరో రెండు చారిత్రక కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోటకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి. గోల్కొండ మెట్లబావి ‘అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్’ కేటగిరీకి, దోమకొండ కోట ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ కేటగిరీకి ఎంపికయ్యాయి. అలాగే, ముంబైలోని ‘ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం’కు ‘అవార్డ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ లభించగా, దేశంలోనే తొలి రైల్వే స్టేషన్ అయిన ముంబైలోని బైకుల్లా స్టేషన్‌కు ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ పురస్కారాలు లభించాయి.

ఈ అవార్డుల కోసం మొత్తం 11 దేశాల నుంచి 50 చారిత్రక కట్టడాలు పోటీ పడగా చివరికి ఆరు దేశాలకు చెందిన 13 కట్టడాలకు ఐదు కేటగిరీల్లో అవార్డులకు ఎంపిక చేశారు. వీటిలో నాలుగు భారత్‌కు, మరో నాలుగు చైనాకు దక్కగా ఇరాన్‌కు రెండు, థాయ్‌లాండ్‌, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ దేశాలు ఒక్కోటి చొప్పున దక్కించుకున్నాయి.

హైదరాబాద్‌లోని గోల్కొండ కోటను 17వ శతాబ్దంలో నిర్మించారు. కాలక్రమంలో ఇది మరుగున పడిపోయింది. కాగా 2013లో ఈ బావి పునరుద్ధరణకు ఆగాఖాన్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ చొరవతో పునరుద్ధణ జరిగింది. ప్రస్తుతం ఈ బావిలో ఊట వస్తోంది.

దోమకొండ కోటను 18వ శతాబ్దంలో కామినేని వంశస్తులు నిర్మించారు. ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇందులో అద్దాల మేడ, రాజభవనం, అశ్వశాల, బుర్జులతోపాటు 4 శతాబ్దాల క్రితం నిర్మించిన మహదేవ ఆలయం కూడా ఉంది. సినీ నటుడు రామ్ చరణ్, కామినేని అనిల్ కుమార్తె ఉపాసన వివాహం ఈ కోటలోనే జరిగింది.

ఇదీ చదవండి: శంషాబాద్ వరకూ మెట్రో.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Exit mobile version
Skip to toolbar