Site icon Prime9

Hyderabad: ఈ నెల 19, 20ల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్

formula e race trail run in Hyderabad

formula e race trail run in Hyderabad

Hyderabad: హైదరాబాద్ లో ఈనెల 19, 20వ తేదీల్లో మరియు వచ్చేనెల 10,11వ తేదీల్లో ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా-ఈ రేస్‌ పోటీలకు హుస్సేన్‌సాగర్‌ వేదిక కానుంది.

దీనికి గానూ హుస్సేన్ సాగర్ పరిసరాల్లో చేపట్టిన 2.7 కిలోమీటర్ల ట్రాక్‌ పనులు పూర్తికావచ్చాయి. ట్రాక్‌కు మెరుగులు దిద్దిన అనంతరం ఈ నెల 19, 20 తేదీల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ ఎండీ సంతోష్‌ తెలిపారు.  ఈ ఈవెంట్ కు నాలుగు రోజుల ముందు నెక్లెస్ రోడ్డును మూసివేస్తామని అధికారులు వెల్లడించారు. పోటీలను వీక్షించేందుకు 10 వేల మంది వరకు ప్రేక్షకులను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘దీని కోసం ట్రాక్‌ వెంబడి 10 స్టాండ్లు ఏర్పాటు చేయనున్నామని, 11 జట్లు 22 రేసింగ్‌ కార్లు ఇందులో పాల్గొంటాయని ఆయన తెలిపారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా ట్రాక్‌ను డిజైన్‌ చేస్తున్నామని  ఆయన చెప్పారు.

ట్రయల్‌ రన్‌ టిక్కెట్లు బుక్‌ మై షో యాప్‌లో అందుబాటులో ఉంటాయని కనీసం రూ.749 నుంచి గరిష్ఠంగా రూ.12 వేల వరకు ఈ టిక్కెట్టు ధరలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 11న జరిగే అసలు పోటీలకు దాదాపు 30 వేల మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే ఈ టిక్కెట్ల విక్రయాలు జోరందుకున్నాయి.

ఇదీ చదవండి: మోదీతో జనసేనాని భేటీ.. అసలు అజెండా అదేనా..?

Exit mobile version