Site icon Prime9

Unstoppable 2 : పవన్ కళ్యాణ్ కి – బాలకృష్ణకి మధ్య తేడా ఏంటో చెప్పిన.. డైరెక్టర్ క్రిష్

director-krish-comments-on-balakrishna-and-pawan-kalyan-in-unstoppable-2

director-krish-comments-on-balakrishna-and-pawan-kalyan-in-unstoppable-2

Unstoppable 2 : ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్నారు. పవన్ ఎపిసోడ్ ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేశారు.

ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ రికార్డులన్నీటిని చెరిపేసి కొత్త రికార్డులను సృష్టించింది.

ఈ తరుణంలోనే తాజాగా రిలీజ్ అయిన ఎపిసోడ్ కూడా ఓ రేంజ్ లో అందర్నీ అలరిస్తుంది అని చెప్పాలి.

ఈ సంధర్భంగా ఈ ఎపిసోడ్ లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కూడా పాల్గొన్నారు.

వాళ్ళిద్దరితో కలిసి ‘అన్‌స్టాపబుల్ 2’ పవర్ ఫైనల్ ఎపిసోడ్ పార్ట్ 2లో సందడి చేశారు.

(Unstoppable 2) ఎవరి స్టైల్ వారిదే.. కానీ ఇద్దరిలో – క్రిష్..  

కాగా ఇప్పుడు మా ఇద్దరితో పని చేశావ్ కదమ్మా! డిఫరెన్స్ ఏంటి? అని బాలకృష్ణ .. క్రిష్ ని ప్రశ్నించారు. అందుకు గాను క్రిష్ మాట్లాడుతూ.. ‘సార్! బేసిగ్గా మీరు ఇద్దరూ కంప్లీట్ డిఫరెంట్. సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. దర్శకుడిగా డిఫరెన్స్ ఏమిటో చెప్పాలంటే.. మీరు (బాలకృష్ణ) కంప్లీట్ డిఫరెంట్ యాక్టర్. పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ మెథడ్ యాక్టర్. గూగుల్ లో మెథడ్ యాక్టర్ అని సెర్చ్ చేస్తే ఏం ఏం వస్తాయో.. పవన్ కళ్యాణ్ గారిలో అవి అన్నీ ఉన్నాయి. ఎప్పుడూ క్యారెక్టర్ మూడ్ లో ఉంటారు. ఆయనకూ అలా ఉండటం చాలా కష్టమే అని క్రిష్ జాగర్లమూడి సమాధానం ఇచ్చారు.

అలానే పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ లో, ఆ మూడ్ లో ఉన్నప్పుడు కొన్ని షాట్స్ తీసుకోవాలని ఎక్కువ కెమెరాలు ఉపయోగిస్తామని క్రిష్ తెలిపారు. మెథడ్ యాక్టింగ్ కి అపోజిట్ క్లాసికల్ యాక్టింగ్ అని..దర్శకుడు చెప్పిన దానికి, స్క్రిప్టులో రాసిన దానికి బాలకృష్ణ ఇంప్రవైజ్ చేస్తారని క్రిష్ చెప్పుకొచ్చారు. నేను షాట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని చాలా సార్లు చూశా. కట్ చెప్పిన తర్వాత కత్తిని గాల్లో ఎగరేసుకుంటూ వస్తారు.. డ్యాన్స్ చేస్తూ వెళతారు అని క్రిష్ వివరించారు.

క్రిష్ మాట్లాడిన తర్వాత ”ఎప్పుడూ సీరియస్ గా ఉండాలి. క్యారెక్టర్ మూడ్ లో ఆ విధంగా ఉండాలి.. నాకు ఆ గొడవ లేదు అని బాలకృష్ణ అంటే… వెంటనే చాలా కష్టం సార్ అందరికీ అలా కుదరదు” అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ”నాకు అలా సెట్ అయ్యిందమ్మా” అని బాలకృష్ణ సమధానం ఇచ్చారు.

క్రిష్ అంతకు ముందు బాలకృష్ణ కెరీర్ లో 100 వ చిత్రంగా వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో.. బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి విఎస్ జ్నానశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version