Site icon Prime9

South Central Railways: పట్టాలు తప్పిన గూడ్స్.. పలు రైళ్లు రద్దు

goods train derailed in Rajahmundry

goods train derailed in Rajahmundry

South Central Railways: బుధవారం తెల్లవారుజామున ఏపీలోని రాజమండ్రిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దానితో అటుగా నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని పేర్కొనింది.

బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రాజమహేంద్రవరం స్టేషన్‌ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం వల్ల ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో కోల్‌కతా-చెన్నై రహదారిలో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్‌పైకి చేరుకుని హుటాహుటిన మరమ్ముతులు చేస్తున్నారు. దీనితో తొమ్మిది రైళ్లను రద్దు చేస్తున్నట్టు మరికొన్ని రైళ్లను ఆలస్యంగా నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే శాఖ ప్రకటించింది. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. విజయవాడ-లింగంపల్లి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుందని.. విజయవాడ-విశాఖపట్నం, విశాఖ-విజయవాడ, గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ మధ్య రాకపోకలు సాగిస్తున్న రైళ్లను రద్దుచేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: నేపాల్‌లో భూకంపం.. పరుగులు తీసిన ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు

Exit mobile version