Site icon Prime9

CM KCR: మోదీ.. అవివేక, అసమర్ధ పాలన సాగిస్తున్నారు.. కేసీఆర్

Hyderabad: బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రదాని మోడీ సభపై విమర్శలు గుప్పించారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా మోదీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. ప్రధాని ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. మోదీ. అవివేక, అసమర్ధ పాలన సాగిస్తున్నారని కేసీఆర్ ఫైర్‌ అయ్యారు.

కేంద్ర అసమర్ధ పాలనతో తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయిందని కేసీఆర్ ఆరోపించారు.డబుల్ ఇంజన్ సర్కార్ విషయంలో మోదీకి ధన్యవాదాలు
తెలంగాణ ప్రభుత్వానికి స్పీడ్ ఎక్కువ. కేంద్రానికి స్పీడ్ తక్కువ మారాల్సింది కేంద్రంలో ఇంజన్. కేంద్రంలో కూడా తెలంగాణ లాంటి సర్కార్ రావాలి. నాన్ బీజేపీ ఇంజన్ వస్తేనే దేశం బాగుపడుతుందని ఆయన అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే నాన్ బీజేపీ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం ఎక్కువ. తమిళనాడు, కేరళ, తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువ. యూపీ సీఎం వచ్చి తెలంగాణకు నీతులు చెప్తున్నారు. యూపీ తలసరి ఆదాయం రూ.71వేలు. జాతీయ తలసరి ఆదాయం రూ.1.49 లక్షలు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.7 లక్షలని కేసీఆర్ తెలిపారు.

బీజేపీకి అహంకారం పెరిగిపోయిందని కేసీఆర్ ఆరోపించారు. సుప్రీంకోర్టును కూడా ఖాతరు చేయడం లేదు. ఏక్‌నాథ్ షిండే అంటున్నరు. కట్టప్ప అంటున్నరు. తలకుమాసిన మాటలు మాట్లాడుతున్నారు. సాగునీరు, కరెంటు కూడా ఇవ్వలేదు. మంచినీళ్లు అందించే తెలివితేటలు కూడా లేవని కేసీఆర్ మండిపడ్డారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నపుడు అప్పటి కేంద్ర సర్కారు వైఫల్యం వల్లే రూపాయి విలువ తగ్గిందని విమర్శించారు. మరి ఎనిమిదేళ్ల మోదీ పాలనలో డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనమై ఏకంగా రూ.80కి చేరుకుంది. ఇదే విషయాన్ని అప్పుడు ఆయన అడిగారు. ఇప్పుడు మేం అడగొద్దా? రూపాయి విలువ ఇంత దరిద్రంగా పడిపోవడానికి కారణం మీ చేతగానితనమా? అవివేకమా? దేశ ప్రజలకు సమాధానం సమాధానం చెప్పాలె అని కేసీఆర్ నిలదీసారు.

 

Exit mobile version