Site icon Prime9

Chiranjeevi: వాల్తేరు వీరయ్యపై చిరంజీవి సొంతంగా తీసిన వీడియో.. కష్టం విలువ తెలిసినవాడే ఇలాంటి వీడియో చేస్తాడు, చూస్తాడు

chiranjeevi About waltair veerayya vedio

chiranjeevi About waltair veerayya vedio

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య”.

బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది.

తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.

ఈ సంధర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య విజయంతో నాకు మాటలు రావడం లేదన్నారు.

ఈ సినిమా కోసం వారు పడిన కష్టాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదని మెగాస్టార్ అన్నారు. ఈ మేరకు వాల్తేరు వీరయ్య సినిమా కోసం పనిచేసిన కార్మికులను చిరంజీవి(Chiranjeevi) స్వయంగా ఘాట్ చేసిన వీడియోను విడుదల చేశారు.

విజయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. కానీ సినీ కార్మికుల కష్టం మనకు తెలియాలన్నారు. వాల్తేరు వీరయ్య విజయం సినిమాకు పనిచేసిన కార్మికులది.

మన మీదతో జాలితో కాదు.. సినిమాపై ప్రేమతో కష్టపడ్డ కార్మికుల కోసం ప్రేక్షకులు సినిమా చూడాలి అంటూ చిరంజీవి ఎమోషనలయ్యారు.

అలానే ప్రేక్షకుల ఉత్సాహమే మనకు ఇంధనం. సినిమా యూనిట్ అంతా థియేటర్లకు వెళ్లాలి. నేను ఈ సినిమా కోసం కష్టపడలేదు. నా బాధ్యతగా అనుకుని పనిచేశా.

కష్టం నాదీ రవితేజది కాదు వారందరిది..

కష్టం నాది, రవితేజది కాదు.. సినిమా బాగా రావాలని పనిచేసిన వారిందరిదీ. నిర్మాతల డబ్బును వేస్ట్ చేయవద్దని, సినిమాకు కావాల్సినవన్నీ పేపర్‌ వర్క్‌లోనే పూర్తి చేసేయాలని చిరంజీవి దర్శకులకు సూచించారు.

సినీ పరిశ్రమ బాగుండాలని దర్శకులు గుర్తించాలన్నారు. నిర్మాతలు బాగుంటేనే నటీనటులు బతుకుతారని చిరు చెప్పారు.

వాల్తేరు వీరయ్య ఔత్సాహిక దర్శకులకు కేస్ స్టడీలాగా ఉపయోగపడుతుంది. ప్రేక్షకులకు థ్యాంక్స్‌ చెప్పక్కర్లేదు.

మంచి సినిమా ఇచ్చినందుకు వాళ్లే థ్యాంక్స్‌ చెబుతున్నారు’’ అని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం చిరు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వసూళ్లలోనూ అదరగొడుతోంది. తొలిరోజు ఏకంగా రూ.29 కోట్లకు పైగా రాబట్టింది. చిరంజీవి కెరీర్ లోనే అతడిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

బాస్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ లలో అన్నయ్య అదరగొట్టారని చెబుతున్నారు.

ఇక బాలకృష్ణ తొలి రోజు అంటే గురువారం రోజున రూ. 25.36 కోట్లు వచ్చాయి. గ్రాస్ 54 కోట్లకు చేరింది. బాలయ్య కెరీర్ లో ఇదే అత్యధికం.

ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో… అత్యధిక వసూళ్లు చేసిన 15వ సినిమాగా వీరసింహారెడ్డి నిలిచింది. ఈ నేపథ్యంలోనే పుష్ప రికార్డును బ్రేక్ చేసింది వీర సింహారెడ్డి సినిమా.

అయితే వాల్తేరు వీరయ్య సినిమా కారణంగా 70 శాతం భాక్సాఫిస్‌ వసూళ్లు పడిపోయాయట. చాలా మంది వాల్తేరు వీరయ్య సినిమాకే వెళుతున్నట్లు సమాచారం.

ఏమైనా సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు హిట్ సాధించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version