Megastar: తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన గొప్ప దర్శకుడు. కె విశ్వనాథ్. ఎన్నో మరపురాని ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కమర్షియల్ చిత్రాలకు దూరంగా.. సాధారణ మనుషుల జీవనశైలే ప్రధానంగా సినిమాలను రూపొందించారు. అలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిని సినిమా ఇండస్ట్రీ కోల్పోవడం చాలా బాధకరమని… మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
ఈ సందర్భంగా.. కె. విశ్వనాథ్ పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు. చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళా తపస్వి ఇక లేరు అనే మాట
తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసినట్లు చిరంజీవి తెలిపారు. తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని.. ఆయన మృతి తనను తీవ్రంగా కలచి వేసిందని చిరంజీవి అన్నారు.. గొప్ప దర్శకుడు కన్ను మూయటం.. సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు.
విశ్వనాథ్ దర్శకత్వంలో తాను ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు. ఆయన మృతిని తట్టుకోలకే.. చిరంజీవి కన్నీళ్లు పెట్టుకున్నారు.
విశ్వనాథ్ గారి సినిమాలు.. యువ దర్శకులకు గ్రంథాలయాలు అన్నారు. విశ్వనాథ్ తో పరిచయం.. దేవుడిచ్చిన వరంగా చిరంజీవి భావించారు.
కళాతపస్వి తెరకెక్కించిన అధిక సినిమాలు సున్నితమైన అంశాలు, సంగీతం, సాహిత్యం, నాట్యం ప్రధానమైనవేనని చిరంజీవి అన్నారు.
కె.విశ్వనాథ్ చిత్రాల్లో.. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు.. లోతైన మాటలుంటాయని అన్నారు.
43 సంవత్సరాల క్రితం ఐకానిక్ చిత్రం శంకరాభరణం విడుదలైన రోజునే ఆయన మరణించడం బాధకరమన్నారు.
ఆ శంకరుడికి ఆభరణంగా కైలాసానికి చేరినట్లు ఉందన్నారు. ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని.. ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
ప్రముఖ దర్శకుడు.. కె. విశ్వనాథ్ భౌతికకాయానికి ప్రముఖ నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు.
పవన్ తో పాటు.. త్రివిక్రమ్ కూడా నివాళులు అర్పించారు. పవన మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని అన్నారు.
శంకరాభరణం సినిమా పాటల ద్వారా సంస్కృతి గొప్పదనం తెలియజేశారన్నారు. ఆయన సినిమాలు అన్ని వర్గాలను ఆకట్టుకుంటాయని అన్నారు.
శంకరాభరణ నుంచి స్వాతిముత్యం వరకు ప్రతి సినిమాను ఒక గొప్ప దృశ్యకావ్యమని పవన్ Pawan kalyan అన్నారు.
అలాంటి మహానుభావులు కాలం చేయడం.. తీవ్రంగా కలచివేసినట్లు పవన్ కళ్యాణ్ అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/