Site icon Prime9

Waltair Veerayya: లక్ష్మణరేఖనైనా దాటుతాను కానీ సురేఖను దాటను.. సుమ అడ్డాలో చిరంజీవి కామెంట్స్

megastar-1

megastar-1

Waltair Veerayya: వెండితెరపైనే కాకుండా బుల్లితెర పై కూడా పూనకాలు లోడింగ్ అంటూ వస్తున్నారు చిరంజీవి. కాకపోతే ఈ సంక్రాంతికి ఈ పునకాలు మరింత స్పెషల్ గా ఉండబోతున్నాయి. యాంకర్ సుమ ‘సుమ అడ్డా’ పేరుతో ఓ కొత్త టీవీ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలిసిందే. ప్రతి శనివారం రాత్రి ఈ షో టెలికాస్ట్ కానుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో ‘కళ్యాణం కమనీయం’ మూవీ హీరో హీరోయిన్లు సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్, దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ వచ్చి సందడి చేశారు. కానీ అసలైన కిక్ ఎక్కించే ఎపిసోడ్ ముందుంది.

సుమ అడ్డాలో అడుగుపెట్టనున్న చిరంజీవి

ఈ సంక్రాంతికి ప్రసారమయ్యే రెండో ఎపిసోడికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ‘వాల్తేరు వీరయ్య(Waltair Veerayya)‘ ప్రమోషన్స్ కోసం మెగాస్టార్ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. బుల్లితెరకు మెగా టచ్ యాడ్ కావడంతో వెండితెరపైనే కాకుండా బుల్లితెరలోనూ చిరు సందడి మామూలుగా ఉండదంటున్నారు అభిమానులు. ఆ ఎపిసోడ్ కు సంబంధించిన లెటెస్ట్ ప్రోమో ను రిలీజ్ చేశారు నిర్వాహకులు.

సుమ అడ్డా లోడింగ్..

క్లాసీ లుక్ లో ఎంటరైన మాస్ వీరయ్య తన మార్క్ కామెడీ పంచులతో అదరగొట్టారు. ’ఈ రేఖలో ఏ రేఖ అంటే మీకు భయమంటే.. సురేఖ అంటే భయమంటూ చిలిపిగా సమాధానమిచ్చారు చిరు. ఆయన లక్ష్మణ రేఖను అయినా దాటుతారు కానీ.. సురేఖ ను దాటరంటూ సుమ కూడా వాల్తేరు వీరయ్యతో కలిసి సందడి చేసింది. సుమకు.. సురేఖగా పేరు మార్చిన చిరంజీవి.. ఆమెతో కలిసి ‘చూడాలని వుంది’ మూవీలోని ఓ సీన్ ను రీ క్రియేట్ చేసి నవ్వులు పూయించారు. ‘డోంట్ స్టాప్ లాఫింగ్.. సుమ అడ్డా లోడింగ్’ చిరు చెప్పిన డైలాగ్స్ ప్రోమో కు హైలెట్ గా నిలిచింది. అంతే కాకుండా తనకు మాత్రమే సాధ్యమయ్యే మ్యానరిజమ్స్ చూపిస్తూ ఫుల్ ఫన్ మూడ్ లో కనిపించారు మెగాస్టార్. ఈ షో లో చిరంజీవితో పాటు వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) డైరెక్టర్ బాబీ, కమెడియన్ వెన్నెల కిశోర్ కూడా పాల్గొన్నారు.

కాగా, వాల్తేరు వీరయ్య సినిమా ఈ నెల 13న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీంతో చిరంజీవి మాస్ ప్రమోషన్స్ చేయనున్నారు. ఈ చిత్రం చిరంజీవి స్టైల్ లో సాగే మాస్ మూవీ అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రంలో రవితేజ పాత్ర ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి:

Janasena Yuvasakthi: 25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు.. మీకు 25 ఏళ్ల భవిష్యత్ ఇవ్వడానికే జనసేన

PM Modi: జోషిమఠ్ లో ఏం జరుగుతోంది.. ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్

Kerala: కేరళలో బీడీలు చుట్టిన వ్యక్తి … అమెరికాలో జడ్జి అయ్యాడు..

KGF 3: 2025లో సెట్స్ పైకి వెళ్లనున్న KGF 3.. మరోసారి రాకీభాయ్ గా కనిపించనున్న హీరో యష్

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

Exit mobile version