Site icon Prime9

ChandrababuNaidu: ఎన్టీఆర్ పేరు మార్పుపై గవర్నర్ ను కలిసిన చంద్రబాబు

Chandrababu met the Governor

Chandrababu met the Governor

AP Governor: ఏపీ శాసనసభలో ఆన్ లైన్ పేరుతో తెల్లవారుజామున తీసుకొచ్చిన పేరు మార్పు జీవో రద్దు చేయాలంటూ మాజీ సీఎం చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరారు. ఈ మేరకు బాబు గవర్నర్ ను కలుసుకొని విజ్నప్తి చేశారు.  గవర్నర్ కూడా వైఎస్ఆర్ పేరును పెడుతూ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ జీవో ప్రవేశపెడుతున్నట్లు తనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదన్నట్లు బాబుతో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేస్తానని చంద్రబాబుకు గవర్నర్ హామీ ఇచ్చారు. చట్టవ్యతిరేకంగా, అనైతికంగా ప్రవర్తించిన ఘటనగా గుర్తించాలని బాబు గవర్నర్ ను కోరారు.

అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు పలు వాస్తవాలను తెలియచేశారు. సిని, రాజకీయ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తిగా రామరావు చిరస్మరణీయుడన్నారు. సమాజంలో మార్పలు చేసేందులో ఎన్టీఆర్ ఓ క్రియేటర్ గా బాబు వర్ణించారు. ఆనాడు సిద్దార్ధ కాలేజీని టేకోవర్ చేసి నూతన వైద్య విశ్వ విద్యాలయానికి తెరతీసారన్నారు. 1986లో అన్ని ప్రైవేటు వైద్యశాలలను ఒక తాటిపై తెస్తూ హెల్త్ యూనివర్శిటీకి బీజం వేసిన వ్యక్తిగా ఎన్టీఆర్ చరిత్రను చెప్పుకొచ్చారు. వైద్య రంగంలో ఎన్టీఆర్ చేసిన పెనుమార్పులను దృష్టిలో ఉంచుకొని 1998లొ ముఖ్యమంత్రి హోదాలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు పెట్టామని బాబు పేర్కొన్నారు.

దీంతో పాటు అప్పట్లో హైదరాబాదులోని నిమ్స్ కూడా ప్రత్యేక హోదా ఇస్తూ జీవో ఇచ్చిన సంగతిని గుర్తు చేసారు. ఆనాటి నుండి నేటి వరకు 24 సంవత్సరాలుగా ఎంతోమంది వైద్య విద్యార్ధులను తయారుచేసిన వర్శిటీగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటి ఘనతను సాధించిందన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న 32 వైద్య కాలేజీల్లో 18 తెదేపా అధికారంలో ఉన్న సమయంలో ఏర్పాటు చేసినవిగా బాబు తెలిపారు. ఇందులో 5 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయన్నారు. ప్రతివక్క జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఇవ్వాలన్న ఆలోచన రావడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పారు. తిరుపతి స్విమ్స్ కూడా అందులో ఒకటిగా చెప్పుకొచ్చారు.

విలువైన సమాచారాన్ని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలతో సీఎం జగన్ వాస్తవాన్ని వక్రీకరించారన్నారు. శాసనసభలో నేడు అధికారంలో ఉన్న మంత్రులకు అవగాహన, వాస్తవాలపై పూర్తి స్థాయిలో సమాచారం లేకుండా మాట్లాడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధుల సభలో వాస్తవాలను దాస్తూ మాట్లాడుతుండడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనంటూ అధికార పార్టీ తీరును బాబు ఎండగట్టారు. అమరావతిలో ఆల్ ఇండియా మెడికల్ యూనివర్శిటీకి నీళ్లు ఇవ్వకుండా అడ్డుకొన్నది నిజం కాదా అంటూ ఈ సందర్భంగా బాబు జగన్ ను ప్రశ్నించారు. వయస్సులోకాని, సమాజంలో చేసిన సేవల్లో ఎక్కడైన వైఎస్ఆర్ కు ఎన్టీఆర్ కు పోలిక ఉందా అంటూ 9కోట్ల తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఘనత ఎన్టీఆర్ ది అని బాబు అన్నారు.

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను వచ్చే ఏడాది చేపట్టనున్న సమయంలో వైద్య విశ్వ విద్యాలయానికి నేడు ఆయన పేరును తొలగించడం సబబా అని జగన్ ను నిలదీసారు. పేర్లను మార్చడం పిచ్చివాళ్లు చేసే పని అంటూ హేళన చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుండి నేటి వరకు ఏ ఏ ముఖ్యమంత్రి హయాంలో ఎన్ని మెడికల్ కాలాజీలు ఏర్పాటు చేసారో లెక్కలు చూసుకోండంటూ బాబు జీవో ప్రతులను మీడియా ముందుంచారు. వైద్య, ఆరోగ్య వ్యవస్ధలను భ్రష్టు పట్టించిన ఘనత నేటి వైకాపా ప్రభుత్వందిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజహితం కోరుకొనేవారైతే ఇలా ప్రవర్తించరంటూ, గుడ్డిగా జగన్ ను నమ్మద్దొంటూ వైకాపా మంత్రులకు బాబు హితోపదేశం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో తిండి పెట్టడం లేదు. మందులు కూడా ఇవ్వడంలేదంటూ కుప్పం వైద్యశాలలో ఉన్న ప్రస్తుత పరిస్ధితిని గుర్తు చేసారు. ఇలా ప్రజా వ్యవస్ధలను నాశనం చేస్తున్న జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు కూడా అర్హత లేదని బాబు దుయ్యబట్టారు. వ్యక్తిగత వైషమ్యాలు ఎంతవరకు కరెక్టన్నారు. రాజకీయ శత్రువులైనా చెన్నారెడ్డి పేరుతో ఇందిరాపార్కు వద్ద మెమోరియల్ కట్టించానని, కోట్ల విజయభాస్కర రెడ్డి జ్నాపకార్ధం స్టేడియం కట్టించామన్నారు. జలగం వెంగల్రావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, కృష్ణకాంత్ లకు సరైన గుర్తింపు నిచ్చింది నిజం కాదా అంటూ రుజువులు చూపించారు.

నాయకులను గౌరవించే విధానాన్ని జగన్ తెలుసుకోవాలన్నారు. చివరకు చెల్లెలు షర్మిల కూడా ఛీ కొట్టే పరిస్ధితి రావడం మనిషి అన్న వాడు చేసే పనికాదని చంద్రబాబు జగన్ కు గడ్డి పెట్టారు. తీసుకొచ్చిన బిల్లును పాస్ చేయద్దని గవర్నర్ గార్కి చెప్పిన్నట్లు చంద్రబాబు మీడియా సమావేశంలో తెలిపారు.

Exit mobile version