Chalo Kondagattu : ఈ నెల 24న జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనానికి సంప్రదాయ పూజలు చేయించనున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి చేతుల మీదగా ఛలో కొండగట్టు పోస్టర్స్ ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నెమురి శంకర్ గౌడ్, జీహెచ్ఎంసీ అధ్యక్షులు రాధరాం రాజలింగం, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్, సురేష్ రెడ్డి, గోకుల రవీందర్ రెడ్డి, జీహెచ్ఎంసి ముఖ్య నాయకులు, పార్టీ వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి త్వరలోనే పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని తెలిపారు.
పవన్ యాత్రని జయప్రదం చేయడానికి జనసైనికులు, వీర మహిళలు అందరూ కృషి చేయాలని కోరారు.
కాగా ఇటీవలే ఈ పూజ కార్యక్రమం గురించి పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.
(Chalo Kondagattu) ఆ ప్రెస్ నోట్ లో..
2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురి కాగా కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు.
అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారని తెలిపారు.
రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం అవుతారని.. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారని పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారు.
కాగా ఇదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శం) ను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు.
ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. ఆ క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారని పేర్కొన్నారు.
ఇటీవలే హైకోర్టు జీవో 1 ని సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
దీంతో వైకాపా సర్కారుకి ఊహించని షాక్ తగిలింది.
కాగా అందుకు బదులుగా జగన్ సర్కారు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టులో దీని గురించి విచారణ ఉన్నందున ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోలేము అని వెల్లడించడంతో వైకాపా నేతలు కంటి మీద కునుకు లేకుండా ఎం చేయాలో అని ఆలోచిస్తున్నారు.
అంతకు ముందు జీవో 1 నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
జనసేన నేత నాగబాబు, పలువురు నేతలు కూడా జీవో 1 ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు.
జగన్ సర్కారు భయంతోనే పవన్ యాత్రను అడ్డుకోవడానికి ఈ జీవో జారీ చేసిందని జనసేన నేతలంతా ఆరోపించారు.
ఈ పరిస్థితుల్లో పవన్ చేయబోయే యాత్ర గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/