Site icon Prime9

కరోనా : నాసిల్ వాక్సిన్‌కి కేంద్రం ఆమోదం… ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది అంటే?

central government approves nasal vaccine and other details

central government approves nasal vaccine and other details

Corona : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మంతా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని దేశాలు కరోనా ఎఫెక్ట్ తో దారుణమైన రోజులను చూడాల్సివచ్చింది. అయితే గత కొంత కాలంగా పరిస్థితులు చక్కబడ్డాయి అని అందరూ అనుకున్నారు. ఈ తరుణంలోనే కరోనా మహమ్మారి మరోసారి బుసలు కొట్టేందుకు రెడీ అవుతుంది. తాజాగా చైనాలో మళ్ళీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల అన్ని దేశాలు మళ్ళీ అప్రమత్తమవుతున్నాయి. కొత్త వేరియంట్లతో దేశంలో ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తుంది.

కాగా మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసుల్లో 81.2 శాతం కొత్త కేసులు కేవలం పది దేశాల్లోనే వెలుగు చూస్తున్నాయని, ఇందులో జపాన్‌ ముందు వరుసలో ఉందని కేంద్రం తెలిపింది. కొత్త కేసులు నమోదువుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యం లోనే అన్ని రాష్ట్రాలు అప్రమత్తం కావాలని సూచించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రముఖ దేశీయ కంపెనీ అయిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన రెండు చుక్కల టీకాకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. దీన్ని ఇప్పుడు నేరుగా నాసికా రంధ్రంలో వేయనున్నారు. దేశంలో నిర్వహిస్తున్న టీకా-ఇ కార్యక్రమంలో భాగంగా ఇది శనివారం నుంచి అందుబాటు లోకి రానుంది. ప్రస్తుతం ఈ చుక్కల టీకా ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండనుంది.

ఇప్పటికే కోవిడ్ షీల్డ్‌, కో వాగ్జిన్‌ టీకాలు తీసుకున్నవారు ఈ నాసికా టీకాను హెటిరోలాగస్‌ బూస్టర్‌గా తీసుకోవచ్చని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే భారత్‌ బయోటెక్‌ డెవలప్‌ చేసిన ఈ చుక్కల మందు టీకా ఇన్‌కొవాక్‌ను బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నవంబర్‌లో అత్యవసర అనుమతి ఇచ్చింది. ఇప్పుడు దీనికి కేంద్రం ఆమోదం లభించగా శుక్రవారం సాయంత్రం నుంచి కొవిన్‌ ప్లాట్‌ఫాంలో అందుబాటు లోకి రానుంది. ఈ టీకాను 18 ఏళ్ల దాటిన వారు ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

Exit mobile version