Site icon Prime9

Bhogi: తెలుగు రాష్ట్రాలలో అంబరాన్ని అంటుతున్న “భోగి” సంబరాలు.. ప్రముఖుల ట్వీట్స్

bhogi festival celebrations in telugu states

bhogi festival celebrations in telugu states

Bhogi: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భోగి శుభాకాంక్షలు చెప్పారు.

పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

నారావారిపల్లెలో సంబురాలు..

చిత్తూరు జిల్లా నారావారి పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మూడేళ్ల అనంతరం నారావారి ఇంట‌ సంక్రాంతి వాతావరణం నెలకొంది.

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్‌లతో సహా నారా కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది.

ఈ సందర్భంగా మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటికే పాడిరైతులతో కలిసి దేవాన్ష్ పాలు పితుకుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భోగిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే సంబరాలు అంబరాన్ని అంటేలా ప్రజలు వేడుకలు చేస్తున్నారు.

మన సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే అచ్చ తెలుగు పండుగను మరింత వైభవంగా నిర్వహిస్తున్నారు.

భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి.

భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలి.

ఈ మకర సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని కోరుకుంటూ ప్రైమ్9 న్యూస్ కుటుంబం తరుపున ప్రత్యేక శుభాకాంక్షలు.

సీఎం జగన్ శుభాకాంక్షలు

ఈ మేరకు .. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన @YSRCParty కుటుంబానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అని సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

 

వీధివీధినా భోగిమంటలతో సందడి చేస్తున్న తెలుగు వారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇంటింటా పేరుకున్న కష్టాలు భోగిమంటల్లో దగ్ధమై, ప్రతి లోగిలీ కొత్త వెలుగులు నింపుకుని మన జీవితాల్లో సరికొత్త క్రాంతికి స్వాగతం పలకాలని ఆకాంక్షిస్తున్నాను అని చంద్రబాబు రాసుకొచ్చారు.

 

పవన్ కళ్యాణ్ ట్వీట్..

భోగి మంటల్లో సమాజంలోని చెడు, ప్రజల కష్టాలు తగలబడి, ప్రతి ఇంట సిరుల పంట, రైతన్నల కంట సంతోషం కురిపించాలి అని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అని జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

 

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version