Balakrishna : నందమూరి బాలకృష్ణను వివాదాలు వెంటాడుతూనే ఉంటున్నాయి. దీనికి కారణం కూడా బాలయ్యే.
ఏదైనా ముక్కు సూటిగా, మొహం మీదే మాట్లాడే నైజాం బాలకృష్ణ సొంతం.
అయితే ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య.. అక్కినేని తొక్కినేని అంటూ మాట తూలడం.. కాస్త వైరల్ గా మారి అక్కినేని అభిమానులు గురయ్యేలా చేసింది.
అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ కూడా ఈ విషయంపై స్పందించారు.
బాలయ్య బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అక్కినేని అభిమానులు డిమాండ్ చేయడం కూడా జరిగింది.
అయితే సాధారణంగా ఒక వివాదం వచ్చినప్పుడు ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి సంబంధిత వ్యక్తులు నోరు విప్పి మాట్లాడితే అంతా క్లియర్ అవుతుంది.
బాలయ్య కూడా అదే చేశారు. కానీ అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి.. మరో వివాదానికి తెరలేపి నా స్టైలే వేరు అనిపించుకుంటున్నారు బాలయ్య.
వివాదంపై స్పందించిన బాలకృష్ణ (Balakrishna)..
తాజాగా అక్కినేని, తొక్కినేని వివాదంపై బాలయ్య స్పందించాడు. “ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ రెండు కళ్లలాంటివారు.. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నాను.. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు.
నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారు.. నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగింది.. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను” అని చెప్పుకొచ్చాడు.
మళ్ళీ నోరు జారిన బాలయ్య..
అదే విధంగా ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆ తరువాత ” నేను అంటే ఆయనకు చాలా ఇష్టం.. సొంత పిల్లలు కంటే ఎక్కువగా నన్నే చూసుకొనేవారు. ప్రేమగా, ఆప్యాయంగా పలకరించేవారు.. ఎందుకంటే అక్కడ ఆప్యాయత లేదు. ఇక్కడ ఉంది. గుర్తుంచుకోండి ” అని పెద్దగా నవ్వారు.
ఇప్పుడు ఈ మాట కొత్త చర్చకు దారితీసింది. సొంత పిల్లలు సరిగ్గా చూసుకోలేదు అంటే అక్కినేని నాగార్జున కుటుంబం ఏఎన్నార్ ను పట్టించుకోలేదా..? సరిగ్గా చూసుకోలేదా..? బాలయ్య అన్న మాటలకు అర్ధం ఏంటి..? అంటూ నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు.
దీనిపై నాగార్జున ఇప్పటి వరకు స్పందించలేదు. చైతూ, అఖిల్ స్పందన వెనకాల ఆయనే ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కానీ నాగ్ మాత్రం సోషల్ మీడియా వేదికగా కానీ, మీడియాతో కానీ ఇంత వరకు ఈ విషయంపై స్పందించలేదు.
అయితే ఇప్పుడు తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు అక్కినేని ఫ్యామిలీకి తగిలేలా, వారిని రెచ్చగొట్టేలా ఉండడంతో ఈ వివాదం మరింత ముదురుతుంది.
మరి దీనిపై అక్కినేని కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇక నిన్ననే (గురువారం) నాగార్జున శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో కనిపించి సందడి చేశారు.
కానీ అక్కడ కూడా నాగార్జున నోరు విప్పక పోవడం గమనార్హం.
ఒక వివాదం ముగిసిపోయింది అనుకుంటే బాలయ్య మరోసారి మాట తూలి ఇంకో వివాదం తీసుకొచ్చారని నందమూరి అభిమానులు ఫీల్ అవుతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/