Ambati Rambabu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అందుకు వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ చేసే పనిలో పడ్డారు. అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని, సీదిరి అప్పలరాజు, ధర్మాన వారి వారి శైలిలో కౌంటర్లు ఇచ్చారు. కాగా అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ నైతికత ఏంటి నీ నైతికత ఏంటి.. ఓట్లు పొందే హక్కు, అర్హత మీకు లేదు. ప్రతి ఒక్కరూ వచ్చి థూ అని ఊసి పోతున్నారు. అమ్ముడుపోవటం, ప్యాకేజ్ తీసుకోవటమనే తాపత్రయం మీది. ఛీడ పురుగులు మీరు.. మీకు భవిష్యత్తు లేదు అని విమర్శించారు.
పవన్ కామెడీ పీస్..
రాజకీయాల్లో పవన్ కామెడీ పీస్ అని ప్రజలకు అర్థమైందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
నా అంత సంస్కారవంతమైన నాయకుడు లేడని అంటాడు.. మంత్రులను దూషిస్తాడు.
పవన్‌ది అసలు నోరేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు.
జగన్ లాంటి ఏనుగు వెళ్తుంటే పవన్ లాంటి కుక్కలు మొరుగుతుంటాయి అని మండిపడ్డారు. సింగిల్‌గా వెళితే వీరమరణం అని నీకు అర్థమైంది. పిరికి సన్నాసుల్లారా మీకు దమ్ము, ధైర్యం లేదు. మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే. మీకు ఆరాటం తప్ప పోరాటమే లేదు. పవన్ దృష్టిలో గౌరవం అంటే ప్యాకేజీయే. తగిన ప్యాకేజీ అందితే పొత్తుకు సిద్ధమని పవన్ మరోసారి చెప్పాడు. చంద్రబాబు కోసం పెట్టిందే జనసేన పార్టీ. పవన్‌లాంటి చీడ పురుగులకు ప్రజలు ఓట్లు వేయరు. చంద్రబాబుతో పవన్ ఏం మాట్లాడాడో మాకు తెలుసు. పవన్ వెళ్తున్న మార్గం మంచిది కాదని యువత గుర్తించాలి’ అని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) వ్యాఖ్యానించారు.
యువశక్తి సాక్షిగా చంద్రబాబు తోడొస్తేనే పోటీ చేయగలనని పవన్ కళ్యాణ్ చెప్పాడు. జగన్ తో పోటీ అంటే మాత్రం ఎవరో ఒకరు తోడుండాలి అని చెప్తూ ధైర్యవంతుడనని చెప్పాడు మంత్రులందరినీ దూషించాడు. సంస్కారవంతుడిని అని అంటూనే మమ్మల్ని తిట్టాడు. పవన్ కళ్యాణ్ ది నోరేనా.. ప్యాకేజ్ స్టార్ అంటే ఒప్పుకోడా.. పవన్, నాగబాబు దమ్ము ధైర్యం లేని పిరికి సన్నాసులు అని ఫైర్ అయ్యారు. గౌరవం లేని చోట పొత్తు లేదంటాడు. గౌరవం అంటే ప్యాకేజ్… గౌరవం అంటే బరువు ఉండాలి. చంద్రబాబు మనుషులే జనసేనలో చేరతారు వారికే టికెట్ ఇస్తారు. జగన్ ముందా ఆయన కుప్పిగంతులు… నిజమైన పిరికి వాడే ధైర్యవంతుడు అని చెప్పుకుంటాడు అని పవన్ పై మండిపడ్డారు అంబటి. ప్రస్తుతం వీరి మధ్య మాటల యుద్దం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/