Veera Simha Reddy: నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెల్లవారుజాము నుంచే బెన్ఫిట్ షోలు వేయడంతో.. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహాలం కనిపిస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘వీరసింహారెడ్డి’ మానియా నడుస్తుంది అని చెప్పాలి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఇదే సినిమాపై చర్చ కొనసాగుతోంది. హై వోల్టాజ్ యాక్షన్ సీన్స్ తో పాటు సెంటిమెంటల్ ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. దీంతో ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది అని ఫ్యాన్స్ అంటున్నారు. వీర సింహారెడ్డి ప్రదర్శించబడుతున్న థియేటర్లలో బాలయ్య పెర్ఫామెన్స్‌కు ఈలలు, గోలలతో పండగ వాతావరణం నెలకొంది.
హద్దులు దాటిన ఆనందంతో కాగితాలు చించి
కాగా ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది. బాలకృష్ణ యాక్షన్ సీన్స్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో కూడా ఏడిపించేసాడు అని తెలుస్తుంది. ఇక ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. అమెరికా థియేటర్లు సైతం ఇండియా థియేటర్లను తలపించేలా ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. కాగా అమెరికా లోని ఒక థియేటర్ లో బాలయ్య ఫ్యాన్స్ చేసిన పనికి వీరసింహారెడ్డి(Veera Simha Reddy) షోని మధ్యలోనే ఆపివేశారు. బాలయ్య ఎంట్రీ సీన్, యాక్షన్ అండ్ సాంగ్స్ సమయంలో పేపర్లు చల్లి థియేటర్ మొత్తం కాగితాలతో నింపేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం షో ని మధ్యలోనే ఆపేసి పోలీసులకు సంచారం అందించారు.
ఇక్కడికి మీరందరు మీ కుటుంబంతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చారు అని తెలుసు. కానీ మేము ఈ షో నిలిపివిస్తున్నాము. ఇక్కడ ఎన్నో ఇండియన్ సినిమాలు విడుదలయ్యాయి.. కానీ ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇలా జరగలేదు. అందుకనే ఈ షో మధ్యలోనే ఆపేస్తున్నాము, కాబట్టి దయచేసి మీరందరు థియేటర్ నుంచి బయటకి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము అంటూ థియేటర్ ఓనర్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి:
Janasena Yuvashakthi: ఫస్ట్ టైం.. ఉత్తరాంధ్ర కళాకారులతో కలసి స్టేజిపై డ్యాన్స్ చేసిన పవన్ కళ్యాణ్
Varahi: వారాహిని అడ్డుకునేందుకే జీవో నెంబర్ 1
తమనీడను తామే చూసి భయపడే స్వభావం జగన్ ది- నాగబాబు
జ్ఞాని ఎవరంటే.. భగవద్గీత శ్లోకం చదివి అందరి చేతా వావ్ అనిపించిన ముస్లిం యువతి
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/