Site icon Prime9

Golden Blood Group: గోల్డెన్ బ్లడ్.. బంగారం కన్నా విలువైన రక్తం

scientists-find-rarest-blood-type-45-people-in-world-have-golden-blood-group

scientists-find-rarest-blood-type-45-people-in-world-have-golden-blood-group

Golden Blood Group: రక్తదానం అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానం అని అంటారు. సాధారణంగా మానవ శరీరంలో ఎనిమిది రకాల బ్లెడ్ గ్రూపులు ఉంటాయని తెలిసిందే. అయితే ఈ 8 గ్రూపులు కాకుండా మనిషి శరీరంలో అరుదైన కొత్త రకం రక్త వర్గాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచంలో కేవలం 45 మంది మాత్రమే ఈ రకం బ్లడ్ గ్రూప్ కలిగి ఉన్నారని పేర్కొంటున్నారు. అందుకనే ఈ బ్లెడ్ చాలా అరుదైనదని విలువైనదని అంటున్నారు. ఇంతకీ ఈ బ్లెడ్ గ్రూపు పేరేంటో తెలుసా గోల్డెన్ బ్లడ్ గ్రూప్.

పురాతన గ్రీస్‌లో దేవతలకు బంగారు రక్తం ఉందని నమ్మేవారని సైన్స్ మ్యూజియం గ్రూప్ చెబుతోంది. దీనిని ఇకర్ అని పిలిచేవారు. అయితే సాధారణ మానవులకు విషపూరితమైనదిగా చెబుతారు. కాగా ఆ తర్వాతి కాలంలో 1961లో ‘గోల్డెన్ బ్లెడ్’ ఉన్న వ్యక్తిని కనుగొన్నారు. నిజానికి ఈ రక్తాన్ని ఏ బ్లడ్ గ్రూప్‌తోనైనా మనుషుల శరీరంలో ఎక్కించవచ్చు. అయితే ఈ తరహా బ్లడ్ గ్రూప్‌ చాలా అరుదుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్లడ్ గ్రూపు ఉన్న 45 మందిలో 9 మంది మాత్రమే రక్తదానం చేసే పరిస్థితిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మిగిలిన 36 మందిలో కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరికొంత మంది రక్తదానం చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ కాబట్టి ఒక చుక్క రక్తం ధర ఒక గ్రాము బంగారం కంటే ఎక్కువే ఉందని అంటున్నారు. దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటుంటారు.

మనిషి శరీరంలో ఈ బ్లడ్ గ్రూపులు ఉండడానికి ప్రధానమైనవి రెండు కారణాలు. మొదటిది ‘జెనెటిక్ మ్యుటేషన్’ కారణంగా ఇది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది. మరొకటి చాలా సన్నిహిత సంబంధాల మధ్య, ముఖ్యంగా బంధువులు, తోబుట్టువులు లేదా ఇతర బంధువుల మధ్య వివాహం కారణంగా, వారి పిల్లలలో గోల్డెన్ బ్లడ్ గ్రూప్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు.అయితే ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్‌ ఉన్న వ్యక్తులు ఎక్కువగా రక్తహీనతకు గురయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కాగా భద్రతా కారణాల దృష్ట్యా ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తుల పేర్లను బయటకు వెల్లడించడం లేదు అధికారులు.

ఇదీ చదవండి:  కౌగిలింతల వైద్యం.. కాసులు సంపాదిస్తున్న మహిళ

Exit mobile version