Site icon Prime9

Viral News: కౌగిలింతల వైద్యం.. కాసులు సంపాదిస్తున్న మహిళ

woman-gets-paid-thousands-to-cuddle

woman-gets-paid-thousands-to-cuddle

Viral News: సాధారణంగా మనం ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు లేదా మనకు కావాల్సిన వారు డల్ గా ఉన్నప్పుడు కౌగిలితో వారికి ధైర్యం చెప్పడం లేదా మన సంతోషాన్ని పంచుకోవడం చేస్తాం. అయితే ఇదో మంచి వైద్య థెరపీ అని ఇలా చెయ్యడం వల్ల డబ్బులు సంపాదించవచ్చని ఎవరికైనా తెలుసా. ఓ మహిళ తాను ఇతరులను కౌగిలించుకున్నందుకు గంటకు అక్షరాలా 12,000 రుపాయలు వసూలు చేస్తుంది. కాస్త విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. ఆ పని చేస్తూ ఆమె ఈజీగా లక్షల రుపాయలను సంపాదిస్తోందంట. ఇంతకూ ఈమె ఎవరు? ఎందుకు ఈ మార్గంలోనే డబ్బు సంపాదించాలి అనుకుంటుందో ఓ సారి చూసేద్దాం.

ఆస్ట్రేలియాకు చెందిన 42ఏళ్ల మిస్సీ రాబిన్సన్ అనే మహిళ మానసిక ఆరోగ్య కార్యకర్త, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి తనవంతు సహాయం చేయాలని భావిస్తోంది. ఈ ఆలోచనతోనే ఈమె కడెల్ థెరపీని ప్రారంబించారు. గతంలో శంకర్ దాదా సినిమాలో చిరంజీవి మానసికంగా బాధపడుతున్న వారికి ఇలా కౌగిలి ఇచ్చి వారికి కాస్త ఊరటను కలిగించడం చూశాం. ఈ తరహాలోనే ఈమె కూడా ఇతరులకు హగ్ ఇచ్చి వారికి మానసిక బాధల నుంచి కాస్త ఊరట కలిగింస్తుంది. ఇలా చేసినందుకు గానూ ఈమె గంటకు 12వేల రూపాయలు వసూలు చేస్తుంది.

మగవారు సర్వసాధారణంగా ఆడవారిలాగా తమ భావోద్వేగాలను త్వరగా బయటకు వ్యక్తపరచలేరు. తమలో తామే కుమిలిపోతూ పైకి  విసుగు, చిరాకు వంటివాటిని ఎక్స్ ప్రెస్ చేస్తారు. కారణం ఏదైనా మానసికంగా డిస్ట్రబ్ అయినపుడు మగవారు కాసింత ఓదార్పు కోరుకుంటారు. అయితే ఆ సమయంలో వారికి ఓ వెచ్చటి హగ్ ఇవ్వడం ద్వారా వాటింన్నింటిని మరచిపోయి ఎంతో సంతోషంగా పనిచేయగలుగుతారట. ఈ విషయాన్ని వైద్య నిపుణులు కూడా వెల్లడించారు. ఈ విధంగా కౌగిలి అనేది గొప్ప ఔషదంలాగా పనిచేస్తుందన్నమాట.

అలాంటి మానసికంగా డిస్ట్రబ్ అయిన వాళ్శకు మిస్సీ మంచి ఆప్షన్ గా మారింది. కస్టమర్ లు కూడా ఆమెను బాగానే అప్రోచ్ అవుతున్నారు. ఒక్కో కస్టమర్ గంట నుండి వారికి నచ్చినంత సమయం వారిని కౌగిలించుకుని సమయానికి తగిన మొత్తాన్ని ఆమె వారి నుండి తీసుకుంటుంది. ఇది కూడా ఓ రకమైన థెరపీ అని చెబుతున్న మిస్సీ ఆస్ట్రేలియా మానసిక ఆరోగ్యసంస్థకు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇలా మానసికంగా ఇబ్బంది పడుతున్నవారికి సహాయం చెయ్యడమే తన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ప్రతి కుక్కకీ ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో.. కుక్కల కళ్యాణం

Exit mobile version